ప్రభాస్ ఏక్ నిరంజన్ స్టోరీ లైన్
ప్రభాస్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ రోజే రిలీజ్ అవుతుంది.ఈ చిత్రంలో ప్రభాస్ ఛోటూ (ప్రభాస్) గా కనిపిస్తాడు. అతను ఓ బౌంటీ హంటర్. పోలీసుల వద్ద డబ్బులు తీసుకుని పారిపోయిన నేరస్దులను పట్టుకుని అప్పచెప్తూంటాడు. అతను చిన్నప్పుడే తనవాళ్లకు దూరమవుతాడు. పోలీసులకు చేరువవుతాడు. వృత్తిలో భాగంగా ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమీర (కంగనా రనౌత్) పరిచయమవుతుంది. ఆమె గిటార్ టీచర్. ఆమెను పెళ్లాడాలని వెంటపడుతుంటాడు. అనుకున్న పనిని సాధించేదాకా వదలని ఛోటూ ఎవరు? అతను ఏక్‌నిరంజన్‌గా ఎందుకు బతకాల్సి వచ్చింది? అనేదే మిగతా కద.
ఈ మధ్య ఏ చిత్రానికి రాని ఓపినింగ్స్ ఈ చిత్రానికి ఎక్సెపెక్ట్ చేస్తున్నారు. విన్నూత తరహాలో గత వారం రోజులుగా టీవీ ఛానెల్స్ లో జరుగుతున్న ప్రచారం బాగానే ఫలించింది. రెండు రోజుల క్రిందటే పై క్లాస్ టిక్కెట్స్ అన్నీ బుక్ అయ్యాయని ధియోటర్స్ వారు చెప్తున్నారు. ఇక ఆన్ లైన్ బుకంగ్ అయితే అసలు దొరకటం లేదంటున్నారు. ఇక ఈ చిత్రంలోని అమ్మా లేదు..నాన్న లేదు అనే పాట సూపర్ హిట్ అయ్యింది. రేడియో ఎఫ్.ఎమ్ లలో ఆటోల్లో ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తోంది.
బుజ్జిగాడు తర్వాత ప్రభాస్,పూరీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో ఆ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని హిట్ కై కృషి చేసి ఉంటాడని అంచనాలు వినపడుతున్నాయి. ఇక మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, సంగీత, మకరంద్ దేశ్‌పాండే, సోనూసూద్, ముకుల్‌దేవ్, బ్రహ్మానందం, అలీ తదితరులు మిగతా పాత్రల్లో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











