»   » షూటింగ్ లేదు కాబట్టే గోపీచంద్ కోసం ప్రభాస్ ఇలా...(ఫోటోలు)

షూటింగ్ లేదు కాబట్టే గోపీచంద్ కోసం ప్రభాస్ ఇలా...(ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: గోపీచంద్ హీరోగా మరో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'బాహుబలి' షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ ఇవ్వడంతో ఖాళీగా ఉన్న ప్రభాస్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

  ఈ చిత్రం ద్వారా రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాహసం ఫేం చంద్రశేఖర్ యేలేటి వద్ద రాధాకృష్ణ అసోసియేట్‌గా పని చేసాడు. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ బేనర్లో ప్రమోద్ ఉప్పలపాటి, వి వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో వీరు ఇదే బేనర్లో ప్రభాస్ హీరోగా 'మిర్చి' చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

  సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో...

  గోపీచంద్ కొత్త మూవీ ప్రారంభోత్సవంలో ప్రభాస్

  గోపీచంద్ కొత్త మూవీ ప్రారంభోత్సవంలో ప్రభాస్

  గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ప్రారంభోత్సవంలో ప్రభాస్....

  దిల్ రాజు

  దిల్ రాజు

  మహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడుతున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు. హైదరాబాద్‌లో యూవి క్రియేషన్స్ ఆఫీసులో ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

  ప్రొడక్షన్ నెం.3

  ప్రొడక్షన్ నెం.3

  గతంలో ‘మిర్చి' లాంటి హిట్ చిత్రాలు అందించిన యూవి క్రియేషన్స్ సంస్థ ప్రొడక్షన్ నెం.3గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

  జూన్ 6 నుండి తొలి షెడ్యూల్

  జూన్ 6 నుండి తొలి షెడ్యూల్

  జూన్ 6వ తేదీ నుండి ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ప్రారంభించనున్నారు. జూన్ 21 వరకు తొలి షెడ్యూల్ జరుగనుంది.

  కమర్షియల్ మూవీ

  కమర్షియల్ మూవీ

  పూర్తి కమర్షియల్ హంగులతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది.

  సాగర్ మహితి సంగీతం

  సాగర్ మహితి సంగీతం

  మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  నటీనటుల

  నటీనటుల

  చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.

  సాంకేతిక విభాగం

  సాంకేతిక విభాగం

  ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: మహతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

  English summary
  Telugu actor Gopichand has signed a new film with debutant director Radhakrishna Kumar, who has worked as an associate to Sahasam director Chandrasekhar Yeleti. This film is produced by Mirchi fame V Vamsi Krishna Reddy and Pramod Uppalapati under the banner of UV Creations. The film unit had a grand muhuratham for this untitled movie on May 30 and Rebel Star Prabhas and producer Dil Raju launched it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more