బక్కచిక్కిన ప్రభాస్..(ఈ అవతారం చూడండి)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం తెగ కష్ట పడుతున్నాడు. ఇప్పటి వరకు కండపట్టి దుక్కలా ఉన్న ఈ హీరో ఇప్పడు బక్క చిక్కిపోతున్నాడు. ఎందుకిదంతా అంటే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'రెబల్' సినిమా కోసం. గత కొంత కాలంగా మీడియా కంట పడని ప్రభాస్ వెంకీ 'బాడీగార్డ్' ఆడియో ఫంక్షన్ లో దర్శనం ఇచ్చి తన స్లిమ్ ఫిజిక్ తో అందరినీ ఆశ్చర్య పరిచాడు.
పరిస్థితి చూస్తుంటే లారెన్స్ తన దర్శకత్వానికి బాగా పదును పెట్టి ప్రభాస్‌తో ఏదో ఎక్స్‌పర్మెంట్ చేస్తున్నాడనే వాదన ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. తన స్టార్ ఇమేజ్(రెబల్ స్టార్) పేరుతోనే ఈ సినిమా ఉండటంతో ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం తెగ కష్ట పడుతున్నాడు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైర్ గా రూపొందుతున్న రెబల్ లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్నారు. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్టం రాజు ఇందులో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్నారు.
ఈ సినిమా చేస్తూనే మరో వైపు కోరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి న్యూలుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ యంగ్ స్టార్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాడో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











