రాజసం ఉట్టిపడేలా ప్రభాస్ లుక్...(ఫోటోలు)
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల గోపీచంద్ వివాహానికి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక్కడ ఆశ్చర్యానికి కారణం ప్రభాస్ రాజసం ఉట్టిపడే గ్రాండ్ లుక్ తో ఉండటమే. తన తర్వాతి సినిమా 'బాహుబలి' కోసం భారీగా గడ్డం, కోరమీసాలు పెంచిన ప్రభాస్ అందరినీ ఆకట్టుకున్నాడు.
రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం.
ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమారాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.

మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు.

మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.

వచ్చే నెలలో ‘బాహుబలి' షూటింగ్ ప్రారంభం అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











