మనోజ్ పెళ్లి వేడుక: ప్రభాస్‌పై మోహన్ బాబు ఎందుకు అలిగారు?
హైదరాబాద్: మంచు మనోజ్ వివాహ వేడుక ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ నటులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకలో ఓ విషయం హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ మీద మోహన్ బాబు అలిగినట్లు తెలుస్తోంది.
అందుకు కారణం ప్రభాస్ చాలా ఆలస్యంగా వివాహ వేడుకకు హాజరు కావడమే అని అంటున్నారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులను తీసుకురాకుండా ప్రభాస్ ఒక్కడే రావడం కూడా మోహన్ బాబు అలకకు మరో కారణం అని అంటున్నారు. ప్రభాస్ రాగానే బుంగమూతి పెట్టుకున్న మోహన్ బాబును తనదైన రీతిలో బుజ్జగించారు ప్రభాస్.
మోహన్ బాబు, ప్రభాస్ మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అక్కడి వారు ఆశ్యర్య పోయారు. స్లైడ్ షోలో ప్రభాస్, మోహన్ బాబుకు సంబంధించిన ఫోటోలు...

మోహన్ బాబు-ప్రభాస్
తనపై అలిగిన మోహన్ బాబును తనదైన రీతిలో బుజ్జగిస్తున్న ప్రభాస్.

అనుబంధం
ప్రభాస్ చిన్నతనం నుండి మోహన్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉంది.

లక్ష్మితో...
మంచు లక్ష్మితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రభాస్.

మంచు విష్ణుతో
మంచు విష్ణు, వెరానిక దంపతులతో కలిసి ప్రభాస్.

సంపూర్ణేష్, కాట్ రాజ్(సుప్రీత్)
ప్రభాస్‌తో కలిసి పాటు కాట్ రాజ్(సుప్రీత్), సంపూర్ణేష్ బాబు పెళ్లి వేడుకలో ఇలా.
Photo Courtesy : MAA TV.


Click it and Unblock the Notifications











