మెగా, నందమూరి వివాహోత్సవాలైయ్యాయి ఇక రెబల్...
వరుసగా యువ హీరోలంతా పెళ్లి చేసుకుని బ్యాచ్ లర్ స్టేటస్ వదులుకుంటున్నారు. అల్లు అర్జున్ తర్వాత జూ ఎన్టీఆర్ కూడా పెళ్లి చేసేసుకోవడంతో ఇక మిగిలిన బ్యాచ్ లర్ హీరోల లిస్ట్ లో నెక్స్ట్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఇమ్మీడియట్ గా పెళ్లికి రెడీగా ఉన్నది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, మిస్టర్ ఫెర్ ఫెక్ట్ ప్రభాసే. ఇటీవల ఇతని పెళ్లి గురించిన వార్తలు మీడియాలో తరుచుగా కనిపిస్తున్నాయి.
ఆల్రెడీ థర్టీ క్రాస్ చేసిన ప్రభాస్ కి మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని వార్తలొస్తున్నాయి. సో నెక్స్ ట్ జరగబోయే ఆ వైభవోపేతమైన వివాహం ప్రభాస్ దే అన్నమాట. చరణ్, చైతన్యలాంటి మరికొందరు కూడా క్యూలో ఉన్నా కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోమని తేల్చి చెప్పేశారు. కేవలం టాలీవుడ్ లోనే కాక ఇటీవల అన్ని వుడ్ లలోను పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్నాయి. బాలీవుడ్ లో హీరోయిన్లు ఎక్కువగా పెళ్లి చేసుకుంటూ ఉంటే దక్షిణాది లో హీరోల పెళ్లిళ్లు అధిక సఖ్యలో అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











