Just In
- 1 min ago
హాట్ టాపిక్ అవుతున్న నితిన్ లవ్ మ్యాటర్.. పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా.?
- 26 min ago
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్.. హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగించిన నాగ్
- 10 hrs ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 10 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
Don't Miss!
- News
వంటగదిలోని "పోపులపెట్టే" మన వైద్యశాల
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 13-12-2019
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మంచు వారింట ప్రభాస్ సందడి.. ఎందుకు వెళ్లారో తెలుసా..?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచు వారింట సందడి చేశారు. శనివారం మంచు విష్ణు ఇంటికి కెళ్లిన ఆయన, వారితో సరదాగా గడిపారు. ఈ మేరకు సదరు పిక్స్ మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇంతకీ మంచు విష్ణుతో ప్రభాస్ మీట్ కావడానికి కారణం ఏంటి? వివరాల్లోకి పోతే..

అదంతా కామన్.. కానీ ఇదే అరుదు
స్టార్ హీరోలు ఒకరినొకరు కలుసుకోవడం, సరదాగా గడపడం చూసి ఫిదా అవుతుంటారు వారి వారి ఫ్యాన్స్. సాధారణంగా ఇలాంటి సందర్భాలు ఏ ఆడియో ఫంక్షన్స్ లోనో లేక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనో చోటు చేసుకుంటాయి. కానీ నేరుగా ఓ హీరో ఇంటికి మరో హీరో వెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా ప్రభాస్, అంన్చు విష్ణు విషయంలో అదే జరిగింది.

మంచు ఫ్యామిలీతో ప్రభాస్.. ఆ టైమ్‌లోనే
మంచు ఫ్యామిలీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి మంచి సంబంధాలున్నాయి. గతంలో మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' సినిమాకు వాయిస్ అందించాడు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో మోహన్ బాబు ఓ ముఖ్యపాత్రలో నటించారు. ఈ టైమ్ లోనే మంచు కుటుంబానికి ప్రభాస్ బాగా దగ్గరయ్యారని టాక్.

పండగ పార్టీ.. అందుకే ప్రభాస్
దీపావళి పండగ సందర్బంగా మంచు విష్ణు గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. శనివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ప్రభాస్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించాడు విష్ణు. ఈ మేరకు మంచు విష్ణు పార్టీకి అటెండైన యంగ్ రెబల్ స్టార్.. మంచు వారితో సరదా సరదాగా గడిపారు.
|
ప్రభాస్.. నా సోదరుడు అంటూ విష్ణు
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మంచు విష్ణు. ‘నా సోదరుడు ప్రభాస్‌తో చాలా రోజుల తర్వాత సరదాగా గడిపాను. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకూ చాలా సంతోషంగా గడిచింది' అని మంచు విష్ణు పేర్కొన్నాడు. మరోవైపు విష్ణు సతీమణి విరానికా కూడా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.

సాహో తర్వాత ప్రభాస్
ఇటీవలే ‘సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం ఓ వింటేజ్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేశ విదేశాల్లోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.