ప్రభాస్ ‘మిర్చి’ ఆడియో రిలీజ్ డేట్
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సినిమా 'మిర్చి' ఆడియో విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అదే విధంగా సంక్రాంతి కి సినిమా విడుదల చేయనున్నారు. ఇంకా వేదిక ఎక్కడ అనేది ఖరారు కావాల్సి ఉంది.
కాగా... ఆడియో ఫంక్షన్ ఎంట్రీ పాసులు దక్కించుకునేందకు ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమాన సంఘాలు తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గతంలో 'రెబల్' ఆడియో సందర్భంగానే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రాగా చాలా మంది పాసులు దొరక్క వెనుదిరిగి వెళ్లి పోయారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'రెబల్' చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో ఇటు ప్రభాష్ తో పాటు అటు అభిమానులు కూడా మిర్చి చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











