SVSC, నాయక్‌లను బీట్ చేసిన ‘మిర్చి’(థియేటర్ల లిస్టు)
అమెరికా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'మిర్చి' అమెరికాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ నెల 7న మిర్చి చిత్రం అమెరికా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 76 స్క్రీన్లలో విడుదలవుతోంది. ఇవన్నీ సూపర్ క్వాలిటీతో కూడిన డిజిటల్ స్క్రీన్సే కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు తాజా ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు.
గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం 69 స్క్రీన్లలో విడుదల కాగా, నాయక్ చిత్రం 53 స్క్రీన్లలో విడుదలైంది. తాజాగా ఆ రెండు సినిమాలను బీట్ చేసిన 'మిర్చి' భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా కూడా ఈచిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని భావిస్తున్నారు.
కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1980ల నాటి బ్యూటీ క్వీన్ నదియా ఇందులో ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తోంది. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

యూఎస్‌ఏ మిర్చి విడుదలువుతున్న థియేటర్ల లిస్టు

Click it and Unblock the Notifications