For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ న్యూ ఇయిర్ విషెష్ ఇలా ...(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ 'మిర్చి' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్ నిమిత్తం న్యూ ఇయిర్ కి ఓ క్యాలెండర్ ని నిర్మాతలు విడుదల చేసారు. ఈ క్యాలెండర్ కి అభిమానుల నుంచి వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ఫోటోలు మీ కోసం...

  కటౌట్‌ని చూసి కొన్ని నమ్మేయాల్సిందే డ్యూడ్‌... అంటున్నారు ప్రభాస్‌. 'మిర్చి' సినిమాలో తాను ఎలా కనిపించబోతున్నదీ ప్రచార చిత్రాల్లో చెప్పకనే చెప్పారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ . వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ నిర్మాతలు. కొరటాల శివ దర్శకుడు.

  ‘‘ఎంతటి వారితోనైనా హాహాకారాలు పెట్టించే సత్తా ‘మిర్చి'ది. పరిధి దాటి ప్రవర్తిస్తే... మిర్చి దెబ్బను మర్చిపోవడం కష్టం. ఈ ఘాటైన లక్షణాలే ఓ మనిషిలో ఉంటే? ఈ ప్రశ్నకు సమాధానమే ‘మిర్చి'లో ప్రభాస్ పాత్ర'' అంటున్నారు దర్శకుడు కొరటాల శివ. రచయితనుంచి దర్శకుడుగా మారుతున్న కొరటాల శివ చిత్రం ‘మిర్చి'.

  నిర్మాతలు మాట్లాడుతూ... ''మిర్చి కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో... అలాగే ఉంటుంది హీరో పాత్ర. నేటి తరం కుర్రాళ్లలో ఉండే దూకుడుతోపాటు వెన్నలాంటి మనసు కూడా అతని సొంతం. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ వినసొంపైన బాణీలు ఇచ్చారు'' అన్నారు.

  లారెన్స్ దర్శకత్వంలో చేసిన రెబెల్ ఊహించని విధంగా భారీగా దెబ్బ కొట్టడంతో ప్రభాస్ పూర్తిగా ఈ సినిమా పైనే దృష్టి పెట్టారు. ఈ సినిమాతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓ హిట్ కొట్టి రాజమౌళితో చేయబోయే చిత్రానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు.

  జనవరి 5 న ఈ చిత్రం పాటల్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

  సినిమా బాగా వచ్చిందని, ముఖ్యంగా టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఛత్రపతి రేంజిలో మిస్టర్ ఫెరఫెక్ట్ లా ప్యామిలీలును ఆకట్టుకుంటానని చెప్తున్నారు ప్రభాస్.

  బిజినెస్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  ప్రభాస్ మాట్లాడుతూ ...‘కొరటాల శివ, నా స్నేహితుల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలన్నీ వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారినిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.

  దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ‘ ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రభాస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'మిర్చి' అనే పేరును ఖరారు చేశాం. యాక్షన్‌ నేపథ్యమున్న కథే అయినా.. ఇందులో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్నాయి. ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించేలా దర్శకుడు కొరటాల శివ ఈ కథను తయారు చేసుకొన్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. 'మిర్చి'లాంటి కుర్రాడిగా ప్రభాస్‌ చేసే హంగామా అభిమానులకు నచ్చుతుంది'' అన్నారు.

  పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు.

  ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.

  సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, ‘సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

  ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను జనవరి మొదటి వారంలో విడుదల చేసి, ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే రోజైన పిబ్రవరి 14 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారు. సత్యరాజ్‌, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సంపత్‌కుమార్‌, ఆదిత్య మీనన్‌ ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అశోక్‌కుమార్‌, ఛాయాగ్రహణం: మది.

  English summary
  
 Team Mirchi has come up with a stunning Mirchi Calendar for the year 2013. The best thing about the calendar is that except for one, all others are just Prabhas alone. Enjoy the treat Darlings, and thanks to Mirchi team for the innovative concept and the beautiful calendar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X