For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘మిర్చి’ ఫస్ట్‌లుక్ టీజర్ రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఇప్పటి వరకు వారధి అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగించిన ఈచిత్రానికి 'మిర్చి' అనే టైటిల్ ఖరారు చేసారు.

    తాజాగా 'మిర్చి' ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని అక్టోబర్ 23న ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా దీపావళికి టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది.

    జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్లో ఆడియో విడుదల చేయనున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.

    English summary
    Young Rebel Star Prabhas’s ‘Vaaradhi’ is now going to be known as ‘Mirchi’. ‘Mirchi’ has been coming up as consideration for this mass entertainer. The first look posters of the film will be unveiled on October 23 to coincide with Prabhas birthday and the trailer would be launched for Diwali and the film will hit the screens in January as a Sankranthi treat. We have to wait whether it is Varadhi or Mirchi or something else.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X