For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిర్చి’కి A సర్టిఫికెటా? ఆ భయంతోనే నిర్మాతలు అలా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన 'మిర్చి' మూవీ ఈ నెల 8న విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పంచెకట్టు ఫైట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఈ ఫైట్ సినిమాకు హైలెట్ గా మారనుందని ఫిల్మ్ నగర్ టాక్.

    కాగా... ఫిబ్రవరి 2న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మిర్చి చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. చిత్ర దర్శక నిర్మాతలు ఇదే సర్టిఫికెట్ వస్తుందని ఆశించి ముందస్తు సంకేతాలు ఇవ్వడం వల్లనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్.

    కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసారని తాజాగా అందుతున్న సమాచారం. ఈ విషయం బయటికి తెలుస్తే సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకులు దూరం అవుతారనే భయంతో నిర్మాతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఈ విషయాన్ని వెల్లడించాలని ప్లాన్ చేసారట. మరో రెండు రోజుల్లో ఏది నిజం అనేది బయటకు రానుంది.

    కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

    సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Rebel Star Prabhas's most-hyped movie Mirchi has completed the formalities of the Regional Censor Board on Saturday, February 2. The Koratala Shiva-directed film was expected to get U/A certificate. But the Censor Board has issued it 'A' certificate. Now, the movie is all set for a grand release worldwide on February 8.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X