‘మిర్చి’ మూవీ టాకేంటి?
హైదరాబాద్: ప్రభాస్ నటించిన 'రెబల్'చిత్రం ప్లాపవ్వడంతో 'మిర్చి' చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే దర్శకుడు కొత్తవాడు కావడంతో సినిమా ఎలా ఉంటుందనే దానిపై అభిమానులు ముందు నుంచీ కాస్త ఆందోళనగానే ఉన్నారు. మరి తాజాగా సినిమా విడుదలయింది.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'మిర్చి' సినిమా టైటిల్‌కు తగిన విధంగా స్పైసీగా లేదని, సినిమా మొత్తం గతంలో వచ్చిన పలు తెలుగు సినిమాల కాన్సెప్టులను కలగాపులగం చేసి తెరకెక్కించారనే టాక్ వినిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు చాలా ఓల్డ్ గా ఉన్నాయని అంటున్నారు.
దర్శకుడు కొత్తవాడు కావడంతో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందని సినీ పండితులు అంటన్నారు. అయితే సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉందంటున్నారు. మొత్తానికి సినిమాను యావరేజ్ అంటున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











