twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘మిర్చి’ ఓవర్సీస్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం ఓవర్సీస్ రైట్స్ 'గ్రేట్ ఇండియా ఫిల్మ్స్' సంస్థ దక్కించుకుంది. గతంలో ఈ సంస్థ పోకిరి, ఏ మాయ చేసావె, చిరుత, అదుర్స్, బృందావనం, కిక్, డాన్ శీను లాంటి హిట్ చిత్రాలను ఓవర్సీస్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసింది. తాజాగా ప్రభాస్ 'మిర్చి' చిత్రాన్ని భారీ రేటుకు చేజిక్కించుకుంది.

    ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మిర్చి'. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం డిసెంబర్ లాస్ట్ వీక్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ మేరకు 'గ్రేట్ ఇండియా' ఫిలింస్ వారు ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్, విక్రమ్, శివ, అశోక్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. 'మిర్చి' సినిమా కోసం కష్ట పడిన పత్రి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈచిత్రం స్టోరీలో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుందని, అదే విధంగా ఇంటర్వెల్ లో హై ఓల్టేజ్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. కథకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కానుందని యూనిట్ సభ్యుల సమాచారం. అదే సమయంలో ఎంటర్ టైన్మెంట్స్ అండ్ కామెడీ ట్రాక్ కు కూడా సరైన ప్రాధాన్యం ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు.

    సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    
 Great India Films, USA, a name synonym to distributing blockbusters Pokiri, Yem Maya Chesave, Chiruta, Adurs, Brindavanam, Kick, Don Seenu at oversea has announced that they have acquired the overseas theatrical rights of Telugu movie Mirchi for whopping price. This film starring Anushka Shetty and Richa Gangopadhyay as heroines, is the next biggest outing of Prabhas after release of Rebel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X