ప్రభాస్ ‘మిర్చి’ పనైపోయినట్లే!

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగుకు సంబంధించిన పని దాదాపుగా అయిపోయినట్లే. మరో వారం రోజుల్లో షూటింగ్ వర్క్ మొత్తం పూర్తి కానుందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం. రేపటి నుంచి ఓ సాంగుతో పాటు మిగిలి ఉన్న కొన్ని సీన్లను షూట్ చేయనున్నారు.

యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

గతంలో ఈచిత్రాన్ని డిసెంబర్లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాతలు, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా థియేటర్ల సమస్య కారణంగా 'మిర్చి' ఫిబ్రవరి 8న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకత్వం: కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X