టెంకాసిలో ప్రభాస్ ‘మిర్చి’
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' చిత్రం ప్రస్తుతం తమిళనాడులోని టెంకాసిలో జరుగుతోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలోగానీ, సంక్రాంతికి కానీ విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈచిత్రం స్టోరీలో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుందని, అదే విధంగా ఇంటర్వెల్ లో హై ఓల్టేజ్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. కథకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కానుందని తెలుస్తోంది. అదే సమయంలో ఎంటర్ టైన్మెంట్స్ అండ్ కామెడీ ట్రాక్ కు కూడా సరైన ప్రాధాన్యం ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











