twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పేరు సూర్య కథ ఇదేనా, ప్రభాస్ మదర్ ఇప్పుడు బన్ని మదర్!

    |

    నా పేరు సూర్య సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 'బన్నీ' వాసు సహనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు విశాల్‌శేఖర్‌ పాటలు స్వరపరిచారు. వక్కంతం వంశి ఈ సినిమాతో దర్శకుడిగా మారడం విశేషం.

    Recommended Video

    JC pawan Reddy Revealed Allu Arjun's Political Entry
     వక్కంతం దర్శకుడిగా

    వక్కంతం దర్శకుడిగా

    అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 'బన్నీ' వాసు సహనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు విశాల్‌శేఖర్‌ పాటలు స్వరపరిచారు. వక్కంతం వంశి ఈ సినిమాతో దర్శకుడిగా మారడం విశేషం.

    అర్జున్ కు ఫాదర్ అర్జున్

    అర్జున్ కు ఫాదర్ అర్జున్

    నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్, సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాలో నదియా బన్ని తల్లి పాత్రలో నటించింది.

    ప్రభాస్ తల్లి అల్లు హీరోకు మదర్‌గా

    ప్రభాస్ తల్లి అల్లు హీరోకు మదర్‌గా

    గతంలో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్‌కు అత్తగా, ప్రభాస్‌కు తల్లిగా మిర్చి సినిమాలో నదియా నటించిన సంగతి తెలిసిందే. బన్ని ఫాదర్‌గా తమిళ నటుడు అర్జున్ నటించడం జరిగింది. బన్ని, అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని సమాచారం.

    ఎలా రిసీవ్ చేసుకుంటారో ప్రేక్షకులు

    ఎలా రిసీవ్ చేసుకుంటారో ప్రేక్షకులు

    ఓ ముఖ్యమైన ఆపరేషన్‌ కోసం ఇండియా, పాకిస్తాన్‌కు వెళ్లిన హీరో ఏం చేసాడు, చివరికి తను లక్ష్యాన్ని సాధించాడా అన్నది చిత్ర కథాంశం‌గా తెలుస్తోంది. మంచి కథ , కథనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Naa Peru Surya, Naa Illu India film produced by Sirisha and Sridhar Lagadapati under the Ramalakshmi Cine Creations banner, and written and directed by Vakkantham Vamsi.Latest news that Nadiya playing allu arjun mother
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X