మగధీర కన్నా ఎక్కువగానే ప్రభాస్ కి..రాజమౌళి
ప్రభాస్, రాజమౌళి కాంబినేష్ లో ఈగ తర్వాత ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వచ్చే ఏప్రియల్ లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఇక ఈ చిత్రంకి బడ్జెట్ గురించి చెపుతూ రాజమౌళి.. మగధీర కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. నిజానికి మగధీర తర్వాత చిన్న సినిమా చేసిన తర్వాత ఇది చేయాలి. కానీ మధ్యలో ఈగ వచ్చింది. దీనిని కూడా రెండు భాషల్లో తీస్తున్నాను' అని వివరించారు.అలాగే కథ గురించి చెపుతూ... ప్రభాస్‌తో తీయబోయే సినిమాకు సంబంధించిన పని మొదలైంది. ఛత్రపతి తర్వాత చేస్తున్న చిత్రమిది. చాలామంది అనుకుంటున్నట్టు విశ్వామిత్ర కాదు. అయితే కథగురించి ఇప్పుడే చెప్పను. సెప్టెంబర్‌లో సెట్స్‌కు వెళుతుంది. ఇది ఫాంటసి చిత్రం.
అయితే అది హిస్టారికలా, లేక జానపదమా లేక పౌరాణికమా అనేది స్పష్టంగా చెప్పలేను. ఇది పూర్తిస్థాయి ఫాంటసీ చిత్రం అవుతుంది. ద్విభాషల్లో అంటే తెలుగు, తమిళ్‌లో రూపొందిస్తాం అన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రెబెల్ చిత్రం బిజీలో ఉన్నారు. ఈ చిత్రం మొదలయ్యే నాటికి రెబెల్ పూర్తి చేయాలని నిర్ణయంతో ఉన్నాడు. రాజమౌళి సైతం ఈగ ను పూర్తి చేసి పూర్తిగా ఈ చిత్రంపై దృష్టి పెడతారు.ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసే చిత్రం అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంకు సంభందించి పూర్తి వివరాలను నిర్మాతలు ప్రకటించే అవకాశం ఉంది. పంజా విడుదల అయ్యాక ఈ చిత్రం గురించి ప్రకటన వస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











