ప్రభాస్ సినిమాల్లో దేవుళ్ళకి అవమానాలు? ఆదిపురుష్ తర్వాత కల్కిలో కూడా అంటూ నెటిజన్ల ఆగ్రహం

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర పలు చిత్రాలు ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. అయితే మెయిన్ గా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ ని నమోదు చేస్తున్న పది చిత్రాల్లో డెఫినెట్ గా 5 చిత్రాలు మైథలాజి బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్నాయి. కొంతమంది దేవుడు పేరు చెప్పి డబ్బులు చేసుకుంటుంన్నారు అనుకుంటున్నారు..

కానీ ముందు తరాల వారికి మన దేశ పురాణాలు, చరిత్ర కోసం తెలియజేస్తున్నామని ఫిలిం మేకర్స్ అంటున్నారు. అయితే ఈ తెలియజెప్పే ప్రయత్నంలో పలు చిత్రాలు కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంటున్నాయి. కాగా ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన చిత్రాలు రెండు ఉన్నాయని చెప్పాలి. ప్రభాస్ పలు భారీ చిత్రాలకి బరువైన పాత్రలకి సరిపోతాడు అని పలు బరువైన పాత్రలని దర్శకుడు తీసుకొస్తున్నారు.

Prabhas movies insulting gods with worst dialogues than adipurush now in kalki

కానీ వారి వల్ల ఇప్పుడు ప్రభాస్ చిక్కుల్లో పడే ఛాన్స్ ఉందని చెప్పాలి. దేవుళ్ళ మీద సినిమా తీసినప్పుడు అందులో ఎలాంటి అసభ్యత, మాట కూడా తూలకుండా ఉండేలా కొందరు ప్లాన్ చేసుకుంటారు కానీ గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన చిత్రంలో ఆంజనేయ స్వామితో చెప్పించిన పలు డైలాగ్ లు ఎంత కాంట్రవర్సీ రేపాయో అందరికీ తెలిసిందే.

కాగా ఆ నెగిటివ్ తో వెంటనే డైలాగ్స్ అప్డేట్ చేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ కల్కి లో కూడా ఇదే తరహాలో రిపీట్ అయ్యింది. సినిమా ఓదలైన కొన్ని నిమిషాల్లోనే కాల భైరవుడు పైన ఓ డైలాగ్ ఉంటుంది. కాశీలో దేవుడు బ్యాన్ అని తెలీదా వీడి పేరేంటి అని ఓ పాత్రదారుడు అడుగుతాడు. ఇది అభ్యంతరకరం కాదా? అయితే ఈ డైలాగ్ ని రిలీజ్ రోజు ప్రింట్ లో ఉంచారు కానీ తర్వాత దాన్ని ఎడిట్ చేసేసారు.

Prabhas movies insulting gods with worst dialogues than adipurush now in kalki

కావాలంటే ఇపుడు చూసినా ఆ బిట్ దగ్గర చిన్న తేడా మనం గమనించవచ్చు. మరి ఈ రెండూ కూడా ప్రభాస్ సినిమాలకే అది కూడా మైథలాజి సినిమాలకే జరగడం గమనార్హం. మరి అలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం బాధ్యతా రాహిత్యం అనుకోవాలా లేక ప్రేక్షకులు ఎలా ఉన్నా చూస్తారు అనుకుంటున్నారా అనేది మాత్రం ఇలా తీసే మేకర్స్ కే తెలియాలి.

ఇక నెక్స్ట్ మైథలాజి బ్యాక్ డ్రాప్ లో అయితే కల్కి సీక్వెల్ తప్ప మరో సినిమా ప్రస్తుతానికి లేదు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే మిగతా షూటింగ్ ని మొదలు పెట్టుకోనుండగా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్టుగా నిర్మాత అశ్వినీదత్ రివీల్ చేశారు. కాగా పార్ట్ 2 లో ఐతే ఎగ్జైటింగ్ మూమెంట్స్ అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ మరియు ప్రభాస్ ల నడుమ యాక్షన్ ఎలిమెంట్స్ మామూలు లెవెల్లో ఉండవని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

More from Filmibeat

Read more about: prabhas om raut nag ashwin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X