నేను ఇచ్చిన స్టోరీ తోనే ప్రభాస్ సినిమా...దిల్ రాజు

By Srikanya

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా కధా రచయిత అవతారమెత్తారు. దశరధ్, ప్రభాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రంకి ఆయనే స్టోరీ అందించానని చెప్తున్నారు. అందుకే కథ..శ్రీ వెంకటేశ్వర యూనిట్ అని పడుతుందని, ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి నిర్మాత కథ ఇచ్చినప్పుడు అలా వేయటం ఆనవాయితీగా వస్తోందని, తాను అదే చేస్తున్నానని అన్నారు. ఇక ఈ చిత్రం కథ తన మనస్సులో చాలా కాలం నుంచీ ఉన్నదని, దశరధ్ తన దగ్గరకి వచ్చినప్పుడు ఆ ప్లాట్ చెప్పి డవలప్ చేయమన్నానని, అందుకే ఆ క్రెడిట్ యూనిట్ కే చెందాలని భావిస్తున్నానని వివరణ ఇచ్చారు. అలాగే టైటిల్ ని వేరే నిర్మాత నుంచి తీసుకున్నానని, వాళ్ళు మహేష్ బాబుతో ఈ టైటిల్ తో చిత్రం చేద్దామనుకున్నారని, తాను అడిగితే ఇచ్చారని అన్నారు. తమ కథకు కరెక్టుగా ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని అన్నారు. ఈ మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు.

అలాగే... ప్రతి ఒక్కరూ తమ జీవితంలో 'మిస్టర్ పర్‌ఫెక్ట్"గా ఉండాలనుకుంటారు. అయితే అది కొందరి జీవితంలో మాత్రమే సాధ్యపడుతుంది. మరికొందరి జీవితాల్లో పరిస్థితుల బట్టి సాధ్యపడదు. ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యే కథాంశమిది అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ నెల 15 నాటికి షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని, ఈ నెల ద్వితీయార్థంలో పాటలను, సంక్రాంతి కానుకగా చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.కె. విశ్వనాథ్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షాయాజి షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, స్క్రీన్‌ప్లే: పి. హరి, కెమెరా: విజయ్ కె. చక్రవర్తి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: దిల్ రాజు, కథ-దర్శకత్వం: దశరథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X