ప్రభాస్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్'స్టోరీ లైన్ ఏంటి?
ప్రభాస్, తాప్సీ, కాజల్ కాంబినేషన్ లో రూపొందిన 'మిస్టర్ పర్ ఫెక్ట్'చిత్రం ఈనెల 22న విడుదలకానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం కథ విషయానికి వస్తే..ఆకతాయి అబ్బాయి కథ ఇది. పర్‌ఫెక్ట్‌గా ఉండడం అస్సలు తెలీదు. కానీ తను ప్రేమించిన అమ్మాయి కోసం అలా మారాల్సి వస్తుంది. మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకోవడానికి హీరో ఏం చేసాడు అన్నహైలెట్ గా నిలుస్తుంది.అలాగే ఈ చిత్రంలో హీరో ప్రసాదం తప్ప పూజంటే ఏమిటో తెలికపోయినా ప్రేమించిన అమ్మాయి కోసం గుడికి వెళ్తాడు. రెండు గంటల పాటు షాపింగ్ చేసి రూపాయిన్నర బొట్టు బిళ్ల కొన్నా ముఖం మీద చిరునవ్వు చెదరనివ్వడు. ఇష్టం లేకపోయినా కంపెనీ కోసం గంటకో ఐస్‌క్రీమ్ తింటాడు. అయితే 'మా నాన్న కోసం ఇంకా మారాలి' అని ఆమె షరతు పెట్టడంతో అతనికి ఎక్కడో కాలింది.'నేను ప్రేమించింది నిన్నే.. మీ నాన్నను కాదు' అని తెగేసి చెప్పాడు.అప్పుడేం జరిగిందో తెలియాలంటే 'మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమా చూడాల్సిందే.దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్నిదిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, ఫొటోగ్రఫీ: విజయ్ కె.చక్రవర్తి, స్క్రీన్‌ప్లే: పి.హరి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











