మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ప్రభాస్ ఎలాంటి సినిమా ఒప్పుకున్నా కూడా మినిమమ్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతాయని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే బడ్జెట్ ఈజీగా 250కోట్లు దాటేస్తోంది. చేతిలో ఉన్న ప్రతి సినిమా కూడా అభిమానుల్లో అంచనాల డోస్ ను అమాంతంగా పెంచుతోంది.
ఒకదానికి మించి మరొకటి అనేలా ఉన్నాయి. ఒక విధంగా ప్రభాస్ ఈ లాక్ డౌన్ ను చాలా బాగా ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. దాదాపు నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం వరుసగా 4 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే అందరి చూపు ఎక్కువగా వైజయంతి ప్రొడక్షన్ లో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాపైనే ఉంది.

ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కానుందట. జూన్ కంటే ముందే ఒకసారి వర్క్ షాప్ లో పాల్గొననున్న ప్రభాస్ సినిమా కోసం పర్ఫెక్ట్ షెడ్యూల్ అయితే రెడీ చేసుకున్నాడట. జూన్, జూలై రెండు నెలలు కూడా ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కోసమే ఎక్కువగా వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యలో సలార్, ఆది పురుష్ షూటింగ్స్ కు కొంత గ్యాప్ రావచ్చని సమాచారం. సలార్ ను సమ్మర్ కు షిఫ్ట్ చేయడం వల్ల ప్రభాస్ కు నాగ్ అశ్విన్ తో కలిసి వర్క్ చేసే అవకాశం దక్కింది. ఇక వారి సినిమా 2024 రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











