Kalki 2: ప్రభాస్ కల్కి 2 నుంచి క్రేజీ అప్డేట్.. ఇక డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలే..
Kalki 2 Movie Update: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ,రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ లో నటించిన సూపర్ హిట్ మూవీ 'కల్కి 2898'. ఈ భారీ బడ్జెట్ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భారీ తారాగణంతో పాటు, అంతకుమించి బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్దనే కాకుండా ఓవర్సీస్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్తుంది కల్కీ. అలాంటి మూవీ సీక్వెల్ గా 'కల్కి 2' మూవీ త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైస్ గా ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్న ఈ మోస్ట్ వాంటెండ్ మూవీ కి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ను చిత్ర నిర్మాతలు అందించారు. ఇంతకీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఓ లూక్కేయండి .
హీరో ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కల్కి. ఇప్పటికే పార్ట్ 1 విడుదల కాగా పార్ట్ 2 త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మించారు. ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా.. రూ. 1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ మూవీలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోయిస్ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ప్రభాస్ తొలుత ఫైటర్ భైరవగా సందడి చేసి.. చివరలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై అంచనాలు పెంచేశారు.

మోస్ట్ అవెంటెండ్ మూవీ కల్కీ 2 గురించి క్రేజీ అప్టేడ్ ఇచ్చారు మూవీ మేకర్స్. తాజాగా గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకలలో తెలుగు సినిమాలు కూడా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు తారలు, టెక్నీషియన్స్, మూవీ మేకర్స్ హాజరవుతున్నారు. ఈ వేడుకలకు కల్కి మూవీ నిర్మాతలు
స్వప్న దత్తు- ప్రియాంక దత్తు లు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కల్కి 2 గురించి పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు.
కల్కీ 2 మూవీ నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కల్కి పార్ట్ 2 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందని తెలిపారు. అయితే.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే అన్ని సెట్ చేసిన తర్వాత తామే వెల్లడిస్తామని చెప్పారు. ఇక కల్కి పార్ట్ 2 కు సంబంధించిన షూటింగ్ 35 శాతం షూటింగ్ పూర్తయిందంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ప్రభాస్ సంబంధించిన అప్డేట్స్ మాత్రం అందించలేదు. కానీ, కల్కి 2 లో కూడా దీపికా పదుకొనే పాత్ర కొనసాగుతుందని, ఆమె తల్లి పాత్రలో కనిపించపోతుందని వెల్లడించారు కల్కీ మూవీ ప్రొడ్యూసర్స్. గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకలలో పాల్గొనడం తమకు సంతోషంగా ఉందని, తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి హోదా దక్కడం ఎంతో గర్వంగా ఉందని మూవీ మేకర్స్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











