Project K Official: ప్రభాస్ ను ఢీకొట్టడానికి సిద్ధమైన కమల్.. ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు కలిస్తే రణరంగమే!
ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ మల్డీ స్టారర్ వస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చాన్ ఉండగా.. ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ చేరిపోయారు. ఆయన ఎవరో కాదు.. లోక నాయకుడు కమల్ హాసన్. ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఆ వివరాళ్లికి వెళితే...
ప్రాజెక్ట్ కె అధికారిక ప్రకటన: ప్రభాస్ ప్రాజెక్ట్ కె పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటిస్తుండగా... బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక రోల్ లో నటిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా... ఈ సినిమా నుంచి ఆఫిషియల్ అప్ డేట్ వచ్చింది.

ప్రభాస్ ను ఢీకొట్టేందుకు కమల్: ఈ సినిమా నుంచి వచ్చిన ఆసక్తికర అప్డేట్ ఏంటంటే... గత కొన్నిరోజులుగా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్న నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఈ సినిమా కోసం 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అధికారిక వార్త వచ్చింది. ప్రాజెక్ట్ కె టీంలో కమల్ హాసన్ చేరాడని ప్రకటించింది చిత్రబృందం. ఈ న్యూస్ విన్న అభిమానులు ఖుషి అవుతున్నారు.
ప్రభాస్ ఎమోషన్ పోస్ట్: భూమిని కప్పి ఉంచే నీడ మాకు కావాలి. అందుకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అతనే లోకనాయకుడు కమల్ హాసన్. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రాజెక్ట్ కె లో భాగం అవుతుండటం ఆనందంగా ఉంది.. అంటూ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. మరోవైపు ప్రభాస్.. కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు.
నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రాజెక్ట్ కె లో లెజెండరీ కమల్ హాసన్ సార్ తో కలిసి పనిచేసేందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందంటూ.. ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పవర్ ఫుల్ రోల్ లో కమల్: గత ఏడాది విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు కమల్.. ప్రభాస్ తో ఢీ కొట్టడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతుందని అంటున్నారు.
మరోవైపు ఇప్పటికే ప్రాజెక్ట్ కె 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంత ఆలస్యమైనా విలన్ సెట్ లోకి రావడం ఎలా సాధ్యమన్నది చాలా మందిలో కలుగుతున్న ప్రశ్న. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు మాత్రమే కమల్ హాసన్ కాల్షీట్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒక వేళ 20 రోజులే డేట్స్ ఇస్తే.. ఏదైనా అతిథి పాత్రలో కమల్ కనిపించనున్నాడు అంటున్నారు.
సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కె: ప్రాజెక్ట్ కె లో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణెతో పాటు... దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా ప్రాజెక్ట్ కె ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











