»   » బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ ఇదే... సుజిత్ తో సినిమా కోసమే

బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ ఇదే... సుజిత్ తో సినిమా కోసమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతనాలుగేళ్ళుగా ప్రభాస్ లుక్ ఒకటేలా ఉంది ఎప్పుడు చూసినా గడ్డం,పేద్ద మెలితిరిగిన మీసం, పొడవుగా పెరిగిన జుట్టుతో కనిపించాడు. 'బాహుబలి: ది బిగినింగ్' తర్వాత ఆరు నెలలకు పైగా గ్యాప్ వచ్చినా అవతారం ఏమీ మార్చలేదు, జుట్టూ గడ్దం అలాగే కంటిన్యూ అయ్యాయి. ఆ సమయం లో రానా మాత్రం చక్కగా ఒక సినిమానే లాగించేసాడు.

పార్ట్ టూ తర్వాత కూడా రానా త్వరగానే మామూలు లుక్ లోకి వచ్చేసాడు. కానీ ప్రభాస్ మాత్రం చివరికి 'బాహుబలి: ది కంక్లూజన్' కూడా పూర్తయ్యాక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సైతం ప్రభాస్ అదే అవతారంలో దర్శనమిచ్చాడు. ఎప్పుడు ఏసందర్భం లో రీషూట్ అంటారో, ఏ సీన్ కి ప్యాచ్ అప్ అవసరం పడుతుందో తెలియక ఆ లుక్ ని మార్చలేకపోయాడన్నది నిజం. అయితే అన్ని సంవత్సరాలు ఒకే అవతారం లో ఉండాలంటే కష్టమే. అందుకే ఇక అంతా ఓకే అనుకోగానే ప్రభాస్ మొదట చేసిన పని ఆ లుక్ మార్చేయ్యటం...

Prabhas New Look for Next Movie After Baahubali

బాహుబలి :ది కంక్లూజన్ ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ లో నాలుగేళ్లుగా పెంచుతూ ఉన్న జుట్టును ఎట్టకేలకు కత్తిరించేసి.. మీసం కూడా ట్రిమ్ చేసి.. సరికొత్తగా కనిపించాడు ప్రభాస్. అయితే ఇది మామూలు గా కనిపించటానికి జస్ట్ ట్రిం చేయించటం కాదు. ఈ సినిమా తర్వాత సిద్దంగా ఉన్న సుజిత్ సినిమాలో కంటిన్యూ అయిపోయే లుక్. 'బాహుబలి' లాంటి జానపద చిత్రంలో చేసిన ప్రభాస్.. ఈసారి దానికి పూర్తి భిన్నంగా ఒక అల్ట్రా మోడర్న్ మూవీ చేస్తున్నాడు.

Prabhas New Look for Next Movie After Baahubali

సుజీత్ దర్శకత్వంలో అతను చేయబోయేది జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు. అందుకోసం ప్రభాస్ మోడర్న్‌గా కనిపించాల్సి ఉంటుంది. అంతే కాదు ఇప్పుడు అదనం గా పెరిగిన బరువును కూడా కొంత తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది కానీ.. రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లడానికి టైం పడుతుంది. ఈ లోపు ప్రభాస్ లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యే సమయానికి ప్రభాస్‌ లుక్ లో పూర్తి మార్పు వస్తుబందట. సో ఇంకో భారీ హిట్ కోసం కూడా ఇప్పుడే రెడీ అయిపోతున్నాడన్న మాట.

English summary
Prabhas is out from Amarendra/Mahendra Bahubali look, As per reports this look Will be Contunue in prabhas's Next Movie with Sujith
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu