ప్రభాసేనా ?? "సాహో" కోసం ఇలా మారిపోయాడు
తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన మరో కొత్త లుక్ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ ఎంతో సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు. జేబులో చేతులు పెట్టుకుని, గళ్ల తెలుపు రంగు చొక్కా వేసుకుని, చిరునవ్వు చిందిస్తూ క
Recommended Video

ప్రభాస్ సాహో సినిమా కోసం పూర్తిగా మారిపోతున్నాడు. బాహుబలి కోసం వారియర్ గా మారిన ప్రభాస్ సాహోలో ఫుల్ స్టైలిష్ లుక్ లోకి వచ్చేస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కటౌట్ లా కనిపించబోతున్నాడు ప్రభాస్. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకోసం ప్రభాస్ చాలా వర్కౌట్ చేశాడు.

‘బాహుబలి' తరువాత
‘బాహుబలి' తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తోన్న ‘సాహో' చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులోనే ప్రభాస్ బిజీబిజీగా ఉన్నాడు. ఆ నేపథ్యంలో అప్పుడప్పుడు ఆయనకు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వస్తున్నాయి.

మరో కొత్త లుక్
సరికొత్త లుక్‌లో ప్రభాస్ కనిపించిన ప్రతీసారి ‘సాహో' సినిమాలో ప్రభాస్ లుక్ ఇదేనేమో? అని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన మరో కొత్త లుక్ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ ఎంతో సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు. జేబులో చేతులు పెట్టుకుని, గళ్ల తెలుపు రంగు చొక్కా వేసుకుని, చిరునవ్వు చిందిస్తూ కనపడుతున్నాడు.

వెయిట్ లాస్ నుంచి హెయిర్ స్టైల్ వరకు
మల్టీలింగ్వల్ సినిమాలో యూనిక్ గా కనిపించడానికి స్పెషల్ ట్రైనర్స్ ని నియమించుకున్నాడు. వెయిట్ లాస్ నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్నింటిని మార్చేసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యేలా తనను తాను మార్చుకుని ఇప్పుడు సాహో షూటింగ్ కు రెడీ అయిపోయాడు.

నీల్ నితిన్ ముఖేష్
ప్రభాస్ ఇంత స్టైలిష్ గా మారిపోయి థ్రిల్ చేస్తోన్న సాహోలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా చెయ్యబోతున్నాడు. తెలుగు సినిమా అయినా బాలీవుడ్ లుక్ లో కనిపిస్తోన్న ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే నేషనల్ వైడ్ గా బజ్ క్రియేట్ చేస్తోన్న ఈసినిమా ప్రభాస్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











