Don't Miss!
- News
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిపై ప్రత్యర్థి ఖరారు?
- Finance
mahindra erupee: పండ్ల దుకాణంలో మహీంద్రా.. పేమెంట్ ఎలా చేశారో తెలుసా..?
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Sports
INDvsNZ : గాయంతో టీ20 సిరీస్ యువ బ్యాటర్ దూరం?.. రిప్లేస్ చేసే సత్తా వీళ్లకే..!
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Prabhas: మారుతి సినిమా షూటింగ్ నుంచి ఫస్ట్ ఫొటో లీక్.. డార్లింగ్ స్టైల్ అయితే అదిరింది!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం సెట్స్ పై ఆసక్తికరమైన కాంబినేషన్స్ లో విభిన్నమైన సినిమాలు అయితే చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైనా కూడా ఇంతవరకు అఫీషియల్ గా ఒక్క క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. అందులో ప్రభాస్ న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నెంబర్ వన్ రెమ్యునరేషన్
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్నాడు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ లో అతను అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అతను దేశంలోనే అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రభాస్ తన పారితోషికాన్ని 100 కోట్ల నుంచి 150 కోట్ల రేంజ్ కు తీసుకు వచ్చాడు. రాబోయే సినిమాలు సక్సెస్ అయితే ఆ సంఖ్య మరింత పెరగవచ్చు.

వరుసగా డిజాస్టర్స్
ప్రభాస్ ప్రస్తుతం అగ్ర హీరోలలో అందరికంటే ఎక్కువ స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. రొటీన్ గా కాకుండా భిన్నమైన తరహాలోనే ప్రభాస్ కొత్త తరహా ప్రాజెక్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ బిగ్ బడ్జెట్ సినిమాలను వరుసగా లైన్ లో పెట్టినప్పటికి బాహుబలి అనంతరం సరైన సక్సెస్ చూడలేదు. వరుసగా సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

మారుతి ప్రాజెక్ట్
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎలాంటి క్లారిటి ఇవ్వకపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ అయితే మారుతితో అసలు సినిమా వద్దని వాదిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మారుతి కంటెంట్ మీద నమ్మకంతో అతనితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

సైలెంట్ గా పూర్తి చేస్తున్న ప్రభాస్
హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో మారుతి సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ అయితే వచ్చింది. అంతే కాకుండా రాజా డిలాక్స్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో ఎవరు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రభాస్ మాత్రం సైలెంట్ గా మారుతి సినిమా షూటింగ్ ను అయితే పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ న్యూ లుక్ వైరల్
ఫ్యాన్స్ అసలు మారుతితో సినిమానే చేయకూడదని అనుకుంటున్నారు. ఇక అప్డేట్ అయితే ఎవరు కోరుకోవడం లేదు. ఫ్యాన్స్ కు అయితే తప్పకుండా సరైన కంటెంట్ ఇవ్వాలని మారుతి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూట్ లోకేషన్ కు కు సంబంధించిన ఒక ఫొటో అయితే ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ప్రభాస్ న్యూ స్టైల్ లో కనిపిస్తున్న విధానం చూస్తుంటే మారుతి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.