ప్రభాస్-ఊసరవెల్లి రచయిత సినిమా ప్రారంభం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బృందావనం, ఊసరవెల్లి చిత్రాల రచయిత కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేస్తూ...ప్రభాస్ స్నేహితులు వి. వంశీకృష్ణరెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటిలు సంయుక్తంగా యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న చిత్రం పలువురు సీని ప్రముఖుల సమక్షంలో సోమవారం(అక్టోబర్ 17) నిరాడంబరంగా ప్రారంభమైంది. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఇంకా వారి ఎంపిక జరుగాల్సి ఉంది.
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కెమెరా స్విచాన్ చేశారు. మొదటి షాట్ కు ప్రముఖ నిర్మాత దిల్రాజు దర్శకత్వం వహించారు. ఈ కార్య్రకమంలో దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, ఓమై ఫ్రెండ్ దర్శకుడు వేణు, రచయితలు మచ్చరవి, వక్కతం వంశీ, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, జెమిని కిరణ్, బన్ని వాసు, తదితరులు పాల్గొన్నారు.
సినిమా గురించి దర్శకుడు శివ మాట్లాడుతూ నా తొలి చిత్రం ప్రభాస్ తో చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో ప్రభాస్ గెటప్ తో పాటు పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందన్నారు. యంగ్ రెబల్ స్టార్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. కమర్షియల్ హంగులన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నారు. ఈ సినిమాకు ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్, యాక్షన్ : అరసు, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ : అశోక్ కుమార్ రాజు, కధ, దర్శకత్వం : కొరటాల శివ.


Click it and Unblock the Notifications











