twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌-వినాయక్‌ల సినిమా బస్వ

    By Staff
    |

    ప్రభాస్‌-వివి వినాయక్‌ కాంబినేషన్‌లో రానున్న చిత్రానికి తాత్కాలికంగా బస్వ అనే టైటిల్‌ను పెట్టుకున్నారు. ఈ సినిమాను ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమీప బంధువు, కడప మేయర్‌ రవీంధ్రనాథరెడ్డి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్‌ అయిన జోగి సినిమాకు ఇది రీమేక్‌. అయితే కన్నడ మూల కథకు తెలుగులో చాలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. బస్వ అనేది శివుడి మరో పేరు. కర్ణాటకలో శైవులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ టైటిల్‌ అక్కడ బాగా పట్టింది. అదే టైటిల్‌ తెలుగులో కూడా బాగానే ఉంటుందని నిర్మాత రవీంధ్రరెడ్డి భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించనుంది. ఈశ్వరి ఫిలింస్‌ బ్యానర్‌పై రానున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌. ఆందరూ సక్సెస్‌ఫుల్‌ ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేసుకోవడం రవీంధ్రనాధరెడ్డి బిజినెస్‌ సెన్స్‌ను సూచిస్తోంది. కాగా వైఎస్‌ తనయుడు జగన్‌ సొంత టీవీ ఛానల్‌ త్వరలో ప్రారంభం కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X