»   » ఆ తర్వాత...ప్రభాస్ దారి ఎటు వైపు?

ఆ తర్వాత...ప్రభాస్ దారి ఎటు వైపు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి' సినిమా పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘బాహుబలి' మొదటి భాగం షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దమవుతుండగా, రెండో భాగం షూటింగ్ కూడా 70 శాతం పూర్తయింది. మరో 30 శాతం షూటింగ్ మిగిలి ఉంది.

Prabhas

ఈ చిత్రం పూర్తయిన తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? లేక మరో సినిమాకు సిద్ధమవుతాడా? అనేది హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ అయిన ప్రభాస్ పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నోరకాల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలపై ప్రభాస్ ఏనాడూ స్పందించలేదు. మ్యారేజ్ గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. అతను మాత్రం నవ్వుతూ సైలెంట్‌గా వుండిపోతాడు.

బాహుబలి షూటింగ్ సమయంలో మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ ఆమధ్య ప్రచారం సాగింది. చివరకు ఈ చిత్రం పూర్తి అయ్యేవరకు అతను పెళ్లి చేసుకునే అవకాశాలు లేవని అప్పుడే తేలిపోయింది. బాహుబలి రిలీజ్ కావడం, ప్రభాస్ వివాహం చేసుకోవడం రెండూ ఒకేసారి జరిగే సూచనలున్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి చిత్రానికి సంబంధించి మిగిలి ఉన్న 30శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ తన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో వుండే తన బంధువుల అమ్మాయిని మ్యారేజ్ చేసుకునేందుకు ప్రభాస్ ఓకే చేశాడని వార్తలు వెలువడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌లో ఈ హీరో వివాహం జరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

English summary
Actor Prabhas is rumored to get married in December 2015.
Please Wait while comments are loading...