»   »  బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ తర్వాతి సినిమా భారీగా, వివరాలు!

బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ తర్వాతి సినిమా భారీగా, వివరాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో నేషనల్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రభాస్ సినిమాలు తెలుగు రాష్ట్రాలు దాటి ఆడటం చాలా కష్టం అయ్యేది. కాని ఇపుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది.

ప్రస్తుతం 'బాహుబలి-2' ప్రాజెక్టులో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ నుండి అక్టోబర్ కల్లా రిలీఫ్ కానున్నాడు. ఆ వెంటనే ప్రభాస్ తన తర్వాతి సినిమా ప్రారంభించబోతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్వకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను యూవి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు... తమిళం, హిందీలో కూడా రిలీజవుతోంది. పలువురు హిందీ నిర్మాతలు ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడంతో యూవి ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని త్రిభాషా చిత్రంగా ప్లాన్ చేస్తోంది.

 Prabhas' Next Will Be A Multilingual, DETAILS HERE!

బాహుబలి తర్వాత ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు....మా హీరోను ఇంత పెద్ద స్టార్ కావడానికి దర్శకుడు రాజమౌళి కారణం అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్యాన్స్. ఇప్పటి వరకు తెలుగు నుండి ఏ హీరో కూడా బాలీవుడ్లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. అలా వెళ్లడం...ఫెయిల్యూర్ అయి మళ్లీ టాలీవుడ్ బాట పట్టడం తెలిసిందే. అయితే ప్రభాస్ అయినా బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తే బావుంటుందని అంతా కోరుకుంటున్నారు.

సుజీత్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పూర్తి చేసిన తర్వాత యూవి ప్రొడక్షన్స్ సంస్థ వారు ముంబై, చెన్నైలోని పలు ప్రొడక్షన్ సంస్థలను సంప్రదించారని, ప్రభాస్ సినిమాను తమిళం, హిందీలో భారీగా రిలీజ్ చేయడంలో భాగంగానే వారు సంప్రదింపులు జరిరని తెలుస్తోంది.

English summary
After the humongous success of Baahubali The Beginning, the craze of Prabhas has spread across the boundaries. It is obvious to say producers are queueing to present his immediate release, after the Baahubali The Conclusion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu