బాహుబలి 2 చిత్రానికి నేటితో రెండేళ్లు: అది నా జీవితాన్ని మార్చేసిన సినిమా అంటున్న ప్రభాస్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారతీయ సినిమా రూపాన్నే మార్చేశాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంతో పాటు మనం కూడా వరల్డ్ లెవల్ భారీ చిత్రాలు తీసి సక్సెస్ అవ్వడం సాధ్యమే అని నిరూపించింది.
'బాహుబలి2' విడుదలై ఏప్రిల్ 28తో సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా గురించి తన అనుభవాలు పంచుకున్నారు.

నా జీవితంలో ఐకానిక్ బెంచ్ మార్క్
‘బాహుబలి' ప్రాజెక్ట్ నా జీవితంలో ఒక ఐకానిక్ బెంచ్ మార్క్. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం ఇది. ఇలాంటి సినిమాలో భాగం కావడం నా అదృష్టం. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నోకొత్త విషయాలు నేర్చుకున్నాను.' అన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ 5 ఏళ్ల సమయం కేటాయించారు.

తెలుగు సినిమా స్థాయి పెరిగింది
‘‘బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇండియా వైడ్ ఆడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీని చూసే విధానం కూడా మారిపోయింది. భారతీయ సినిమా పరిశ్రమలో సైతం ఎన్నో మార్పులు రావడానికి కారణమైన చిత్రం ఇది.'' అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

సౌత్ సినిమాలకు ఆదరణ పెరిగింది
బాహుబలి తర్వాత సౌత్ సినిమాలకు ఇండియా వైడ్ ఆదరణ పెరిగింది. నార్త్ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఇక్కడి సినిమాలను ఆదరించడం ఆనందంగా ఉంది. ఇపుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ప్యాన్ ఇండియా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది ఎంతో మంచి పరిణామమని ప్రభాస్ చెప్పుకొచ్చారు

బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నా
బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్‌ను హీరోగా పెట్టి సినిమాలు చేందుకు పలువురు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తున్నారు. కరణ్ జోహార్ లాంటి వారితో ప్రభాస్ మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారు. అయితే హిందీ సినిమాలు చేయడం కన్నా తెలుగు సినిమాలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

సాహో
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో' అనే చిత్రంలో నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో హలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











