డబుల్ డ్యూటీ భరిస్తూ...ప్రభాస్
ఒకప్పడు తెలుగు సినిమా హీరోలు ఒక సంవత్సరంలో నాలుగైదు సినిమాలు చేసేవారు. గత కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో పరిస్థితి చేస్తే మన యువ హీరోలు ఒక సినిమా తీయడానికి రెండు మూడు సంవత్సరాలు తీసుకున్న సందర్భాలున్నాయి. అలా చేయడం వల్ల కెరీర్ లో అతిపెద్ద దెబ్బలు తిన్న పవన్, మహేష్ లాంటి హీరోలు మళ్లీ రూటు మార్చి వరుస సినిమాలతో దూసుకెలుతున్నారు. వీరందరినీ చూసి ముందు జాగ్రత్త పడ్డాడో ఏమోగానీ ప్రభాస్ కూడా వరుస సినిమాలకు సైన్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' సినిమా చేస్తున్న ప్రభాస్...మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో 'వారధి' సినిమా చేస్తున్నాడు.
అయితే ఒక సినిమా తర్వాత ఒక సినిమా కాకుండా ఈ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కొన్నిరోజులు వారధి షూటింగ్ జరిగితే, మరికొన్ని రోజులు రెబల్ సినిమాకు నటిస్తున్నాడట. కెరీర్ లో మంచి ఫలితాలు సాధించడం కోసం ఇలా డబల్ డ్యూటీ భరిస్తూ.... చాలా కష్ట పడుతున్నాడు. ఇటీవలే వారధి షూటింగ్ కోకాపేటలో జరుపుకోగా, ప్రస్తుతం రెబల్ షూటింగులో భాగంగా బ్యాంకాక్ వెళ్లాడు. ప్రభాస్ కష్టం ఫలించి ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రెబల్ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్లు. సంగీతం: తమన్, కెమెరా: రాంప్రసాద్, మాటలు: స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్.
వారధి చిత్రానన్ని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. కొరటాల శివ ఈ చిత్రం తో దర్శకుడి గా మారబోతున్నారు.


Click it and Unblock the Notifications











