ప్రభాస్ ఒక్కడికే దాని మీద ధ్యాస.. మిగతా స్టార్ హీరోలంతా!!
ప్రభాస్ ఒకప్పుడు టాలీవుడ్ హీరో.. కానీ ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ హీరో. బాహుబలి సినిమాలతో ప్రపంచ దేశాల్లో ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. సాహో సినిమాతో ఇండియాలో తన స్టామినాను చూపెట్టాడు. అయితే అనుకున్నంతగా ఆడకపోయినా.. కలెక్షన్ల వర్షం కురిసింది. కేవలం డార్లింగ్‌కు ఉన్న క్రేజ్‌తోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కోట్లు కొల్లగొట్టింది.

ప్యాన్ ఇండియా చిత్రాలే..
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నింటిని ప్యాన్ ఇండియాగానే తెరకెక్కిస్తున్నాడు. మొన్నటి సాహో అయినా రాబోతోన్న ఓ డియర్ అయినా గానీ అన్నీ జాతీయ స్థాయి చిత్రాలే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రమైతే ఏకంగా ప్యాన్ వరల్డ్ అని ప్రకటించేశారు.

మిగతా స్టార్ హీరోలంతా..
టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే ప్యాన్ ఇండియాపై గురి పెట్టాడు. మిగిలిన స్టార్ హీరోలంతా కేవలం టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలు తెలుగు మార్కెట్‌పైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

కలిసి రాని ప్యాన్ ఇండియా..
ప్రభాస్ ఒక్కడికే ప్యాన్ ఇండియన్ చిత్రాలు కలిసి వచ్చేట్టున్నాయి. సాహో చిత్రం మిగిలిన భాషల్లో సరిగా ఆడకపోయినా.. బాలీవుడ్‌లో దుమ్ము లేపింది. అదే సైరా, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల కలెక్షన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. అందుకే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ చేయబోయే కొరటాల శివ సినిమా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కూడా కేవలం తెలుగు మార్కెట్‌ను మాత్రమే టార్గెట్ చేసేలా ప్లాన్ చేశారు.

ఆ దిశగా ప్రయత్నాలు..
అయితే కొంతమంది హీరోలు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ మాత్రం బాలీవుడ్‌పై జెండా ఎగరేయాలని ఆశగానే ఉన్నా.. సరైన కథ, కథనం దొరక్కా ఎదురుచూస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో, నిఖిల్ కార్తికేయ 2 చిత్రంలో ప్యాన్ ఇండియాగా ఎదిగేందుకు ట్రై చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











