ప్రభాస్ ని లైన్లో పెట్టి రాజమౌళికి గాలం వేసిన రిచా గంగోపాధ్యాయ...!?
'లీడర్' సినిమాతో తెరంగేట్రం చేసిన బెంగాలి ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయకు 'మిరపకాయ్'తో అసలైన ఘాటు తగిలింది. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఓ హిందీ చిత్రంలోను నటించేందుకు అంగీకరించింది. నటన పరంగానే కాకుండా అంగాంగ ప్రదర్శనకు హద్దులేవి పెట్టుకోని రిచాకు తమిళంలో మంచి ఆఫర్లే తగులుతున్నా తెలుగులో మాత్రం దర్శకులెవరు ఈవిడను పెద్దగా పట్టించుకోలేదు.
అందుకే కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే అన్నట్టుగా ఏకంగా రాజమౌళి-ప్రభాస్ కలయికలో రానున్న జంబో చిత్రం మీదే కన్నేసింది. ఆంధ్ర రాంబో ప్రభాస్ పక్కన తానైతేనే సెక్సీగా ఉంటానని, ఒడ్డు పొడుగు సరైన మ్యాచింగ్ అని రాజమౌళికి చాలా మంది సన్నిహితుల చేత రికమండేషన్ పెట్టించుకుంటోందని సమాచారం.
అంతే కాదు తాజాగా రిచా అదే రెబల్ స్టార్ ప్రభాస్ తో మరొక్క డైరెక్టర్ దర్శకత్వంలో నటించే ఛాన్సు కొట్టేసింది. కొరటాల శివ దర్శత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రభాస్ స్నేహితులు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రిచా తెలుగులో తన సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. తమిళంలో ఆమె నటించిన రెండు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగు, తమిళ చిత్రసీమల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











