Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ ‘జిక్యూ’ లుక్ మైండ్ బ్లోయింగ్, పెళ్లి గుట్టు విప్పాడా?
'బాహుబలి-ది కంక్లూజన్' సినిమా 2017లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రూ. 1000 కోట్ల వసూళ్ల మార్కు దాటిన తొలి భారతీయ సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుండి నేషనల్ మీడియా ఫోకస్ ప్రభాస్ వైపు మళ్లింది. తాజాగా ప్రభాస్ ప్రముఖ ఇంటర్నేషనల్ మెన్స్ మేగజైన్ 'జిక్యూ' కవర్ పేజీపై దర్శనమిచ్చారు.
ప్రభాస్ లుక్ అదుర్స్
జిక్యూ మేగజైన్ కవర్ పేజీ మీద ప్రభాస్ లుక్ అదిరిపోయే విధంగా ఉంది. 3 పీస్ స్టైలిష్ సూట్లో డిగ్నిఫైడ్ లుక్‌లో ప్రభాస్ లుక్ గతంలో ఎన్నడూ చూడని విధంగా డిఫరెంట్‌గా ఉంది.
ప్రత్యేక ఇంటర్వ్యూ
‘జిక్యూ' మేగజైన్ ప్రభాస్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ప్రభాస్ నుండి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు రాబట్టిందట. ఆ వివరాలన్నీ జనవరి 2018 ఎడిషన్‌లో పొందు పరిచారు.
పెళ్లి గురించి కూడా...
‘జిక్యూ' మేగజైన్ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన పెళ్లి గురించి అంశాలపై కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ వారమే ఈ మేగజైన్ మార్కెట్లోకి రానుంది. మరి ప్రభాస్ ఏం చెప్పాడనే విషయం తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రా కాపీలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనవరి 2018 ఎడిషన్ ప్రభాస్ స్పెషల్ కావడంతో ఇక్కడ ఎక్కువ కాపీలు అమ్ముడయ్యే అవకాశం ఉండటంతో ఎక్స్ట్రా కాపీలు సరఫరా చేస్తున్నారట. ఇక్కడ ఇవి రికార్డు స్థాయిలో అమ్ముడవుతాయని భావిస్తున్నారు.
సాహో
ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజి పెరగడంతో రూ. 150 కోట్ల బడ్జెట్‌తో హిందీ, తమిళం, తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్టు ఇదే కవడం విశేషం. ఇందులో యాక్షన్ సీన్ల కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు.