యంగ్ హీరోయిన్‌కి ప్రభాస్ క్రేజీ విషెస్.. మ్యాటర్ చూస్తే!!
ఇతర హీరోలతో పోల్చితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండరు. అయినప్పటికీ తనకు ముఖ్యం అనుకుంటే ఖచ్చితంగా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పోస్ట్ చేశారు ప్రభాస్.
ఈ రోజు (మార్చి 3) శ్రద్ధా కపూర్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమెకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు ప్రభాస్. ''మై స్వీటెస్ట్ అమ్రితా.. హ్యాపీ బర్త్ డే'' అని పేర్కొన్న రెబల్ స్టార్, ఆమెతో కలిసి నటించిన సాహూ సినిమాలోని రొమాంటిక్ స్టిల్ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ప్రభాస్ అభిమానులంతా శ్రద్ధా కపూర్‌కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇటీవలే సాహూ సినిమాతో అలరించిన ప్రభాస్ ప్రస్తుతం తన 20 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే ఆడిపాడుతోంది. దీంతో పాటు ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్.
మరోవైపు శ్రద్ధా కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె హీరోయిన్‌గా నటించిన 'బాఘీ 3' అతిత్వరలో విడుదల కానుంది. ఏదేమైనా శ్రద్ధా కపూర్‌కి ప్రభాస్ ఇలా విష్ చేయడం ఆసక్తికర అంశంగా మారింది.
View this post on InstagramHere’s wishing my sweetest Amritha @shraddhakapoor a very Happy Birthday!
A post shared by Prabhas (@actorprabhas) on


Click it and Unblock the Notifications











