ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన: వైలెంట్ లుక్‌లో దర్శనమిచ్చిన రెబెల్ స్టార్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత భారీ చిత్రాల్లోనే నటిస్తున్న అతడు.. ఇప్పటికే పలు చిత్రాలను లైన్‌లో పెట్టేశాడు. ఈ క్రమంలోనే 'KGF' వంటి భారీ హిట్ మూవీని రూపొందించిన ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. 'సలార్' (ద మోస్ట్ వైలెంట్ మ్యాన్.. కాల్‌డ్ వన్ మ్యాన్.. ద మోస్ట్ వన్ మ్యాన్) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను వెల్లడించింది నిర్మాణ సంస్థ. యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ కోర మీసంతో ఎంతో వైలెంట్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఇందులో ఓ పెద్ద గన్‌ను కూడా పట్టుకుని రాయల్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను ఓ మాఫియా డాన్ కథతో రూపొందించబోతున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ కనిపిస్తోంది. దీంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Prabhas - Prashanth Neel Movie Announced

మరోవైపు.. ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించే 'ఆదిపురుష్'లో నటించనున్నాడు. అనంతరం నాగ్ అశ్విన్ సినిమా గానీ, ప్రశాంత్ చిత్రం 'సలార్' గానీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X