Aswani Dutt on CBN Arrest: చంద్రబాబు అరెస్ట్.. సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్ నిర్మాత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవెలప్ మెంట్ వ్యవహారంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్టు అప్రజాస్వామికం అంటూ ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్.. చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆయనను అరెస్టు చేసిన వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

స్కిల్ డెవెలప్ మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడం ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఓవైపు వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. టీడీపీ శ్రేణులు మాత్రం అక్రమ అరెస్టులు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని జైలులో పెట్టడం అక్రమం, దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Prabhas Producer Ashwini dutt Shares A Video about Chandrababu Naidu Arrest Issue

ఇక చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు స్పందించారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికే బాలయ్య ప్రెస్ మీట్.. జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఖూనీ చేసిందంటూ... ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక పలువురు సినీ ప్రముఖులు సైతం చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు స్పందించాలంటూ... నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండస్ట్రీని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తే వైఎస్ జగన్ ఏమైనా ఉరి తీస్తాడా అంటూ కౌంటర్స్ వేశారు.

 Prabhas Producer Ashwini dutt Shares A Video about Chandrababu Naidu Arrest Issue

ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వీనిదత్ కూడా ఓ వీడియోను రిలీజ్ చేశారు. బాబు అరెస్టుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పుకొచ్చారు. ఇక అశ్వినీదత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Prabhas Producer Ashwini dutt Shares A Video about Chandrababu Naidu Arrest Issue

ఆ వీడియోలో అశ్వినీ దత్ మాట్లాడుతూ.... ''చాలా దురదృష్ణకరమైన రోజు.. ఓ మహానీయుడు.. ఈ దేశానికి గొప్ప ప్రైమ్ మినిస్టర్ ను, గొప్ప స్పీకర్ ను, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గకరంగా అరెస్టు చేసి.. లేని పోని బీభత్సం చేసిన ఎవరికీ కచ్చితంగా పుట్టగతులు ఉండవు. దీనికి పరిష్కరం ఎన్నోరోజులు లేవు. మూడు నాలుగు నెలల్లో ఎలక్షన్స్ రాగానే దీనికి వాళ్లు శిక్ష అనుభవిస్తారు. 175 సీట్లకు 160 సీట్లు కచ్చితంగా గెలిచితీరుతారు'' అంటూ చెప్పుకువచ్చారు.

ఇక అశ్వీనిదత్ వీడియోకు కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తుంటే...వైసీపీ శ్రేణులు మాత్రం మండిపడుతున్నారు. మరోవైపు ఈ సంఘటనపై ఎన్టీఆర్ ఇంకా స్పందించకపోవడం మీద కూడా చర్చలు సాగుతున్నాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్ రామ్ గానీ ఈ అరెస్ట్ మీద రియాక్ట్ కాలేదు. నారా ఫ్యామిలీ తరుపున నారా రోహిత్ తన సోషల్ మీడియా వేదికగా అరెస్టును ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X