RRRలో నన్ను ఎందుకు తీసుకోలేదు.. మొహం మీదే ఆడిగేసిన ప్రభాస్.. రాజమౌళి ఏం చెప్పాడంటే?

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ఈనెల 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఇక ఈ సినిమాకు కూడా రాజమౌళి తన వంతు సహాయంగా ప్రమోషన్లలో పాల్గొనడం విశేషం. రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ప్రభాస్-రాజమౌళి పాల్గొన్నారు. ఒకరికొకరు అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే ప్రభాస్ RRR సినిమాలో తనను ఎందుకు తీసుకోలేదు అని మొహం మీద అడిగేసాడు. అందుకు రాజమౌళి చెప్పారు అనే వివరాల్లోకి వెళితే..

 స్టార్ క్యాస్టింగ్ తోనే..

స్టార్ క్యాస్టింగ్ తోనే..


రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా పవర్ఫుల్ పాత్రలో నటించిన RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటించాడు. ఆలియా భట్ రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో కనిపించనుంది. ఇక ఈ స్టార్ కాస్టింగ్ తో నే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

RRR కూడా అదే తరహాలో..

RRR కూడా అదే తరహాలో..

దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో యాక్షన్ ఎంత హైలెట్ అవుతున్నా కూడా ఎమోషన్ కూడా అదే తరహాలో ఉండాలి అది జాగ్రత్త పడుతూ ఉంటాడు. వీలైనంతవరకు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తెరపైకి తీసుకు వస్తూ ఉంటారు. ఇక RRR సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది అని ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెబుతున్నారు.

రాధే శ్యామ్ పై పాజిటివ్ కామెంట్స్

రాధే శ్యామ్ పై పాజిటివ్ కామెంట్స్

ఇక రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేశాడు. సినిమాకు సంబంధించిన అంశాల గురించి రెబల్ స్టార్ ను అడిగే ప్రయత్నం చేశాడు. ఇక సినిమా చాలా బాగా వచ్చిందని ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్స్ అలాగే క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది అని దర్శకుడు రాధాకృష్ణ ఒక సరికొత్త ప్రేమ ప్రపంచంలో తీసుకు వెళ్లాడు వివరణ ఇచ్చారు.

RRR లో నన్ను ఎందుకు తీసుకోలేదు

RRR లో నన్ను ఎందుకు తీసుకోలేదు


అయితే ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజమౌళిని ఒక విభిన్నమైన ప్రశ్న అడిగాడు. RRR సినిమాలో తనను ఎందుకు తీసుకోలేదు అని రాజమౌళిని మొహం మీద అడిగేసాడు. ఒకవైపు రామ్ చరణ్ మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ చాలా అద్భుతంగా ఉన్నారు. అలాగే ఆ సినిమాలో నేను కూడా ఉంటే చాలా బాగుండేది కదా అలాంటిది నన్ను ఎందుకు తీసుకోలేదు అని రాజమౌళిని మొహమాటం లేకుండా అడిగేశాడు.

తెలివిగా సమాధానం ఇచ్చిన రాజమౌళి

తెలివిగా సమాధానం ఇచ్చిన రాజమౌళి

ఇక రాజమౌళి ప్రభాస్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. నువ్వు ఒక పెద్ద షిప్ లాంటివి వాడివి.. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కథకు అవసరం అయ్యే పాత్రలో ఉన్నారు. మీరు మొదటి నుంచి కూడా ఏదైనా సరే నేను కథకు ఎంతవరకు అవసరమో అదే ఫాలో అవుతాను. ఒకవేళ నువ్వు సినిమాకు అవసరం అయితే తప్పకుండా తీసుకుంటాను. అందుకు నువ్వు ఒప్పుకుంటావాని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు ఒక ఒప్పుకోక పోయినా కూడా ఏదో ఒక విధంగా నిన్ను ఒప్పించే విధంగా ప్రయత్నం చేస్తాను. కానీ కథకు అవసరం లేనప్పుడు పెద్ద షిప్ ను అనవసరంగా ఇరికించడం ఏ మంత్రం బాగుండదు అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

Recommended Video

Radhe Shyam : Prabhas Cults కి పండగ షురూ.. | Tollywood | Salaar | Filmibeat Telugu
వాళ్ళకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు..

వాళ్ళకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు..

రాజమౌళి ఆ విధంగా సమాధానం ఇచ్చినప్పటికీ ప్రభాస్ మాత్రం కొంచెం కూడా సంతృప్తి చెందలేదు. ఏదేమైనా కూడా మీకు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇష్టమని ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని సరదాగా అన్నాడు. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ కోసమే ఎక్కువగా కొన్ని కథలను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తనతో చెప్పినట్లు గా ప్రభాస్ నవ్వుతూ వివరణ ఇవ్వడం విశేషం. ఇక రాజమౌళి అయితే ప్రస్తుతం నేను ఏ సినిమా చేస్తున్నా ఆ సినిమా హీరోలు తప్పితే నాకు ఎవరు ముఖ్యం కాదు అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ప్రభాస్ కూడా బాహుబలి తో ఆ విషయం నాకు బాగా అర్థమైంది అని కూడా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X