ప్రభాస్ సినిమాకు పోటీగా RRR బ్యూటీ.. రెడ్ లైట్ ఏరియా రౌడీరాణిగా..

బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మొన్నటి వరకు ఇండియన్ సినిమా హిస్టరిలో పెద్దన్న పాత్ర పోషిస్తు వచ్చింది. కొంతమంది హీరోయిన్స్ మన సినిమాలు చేయడానికి ఎంతగానో ఆలోచించే వారు. కానీ పాన్ ఇండియా కాన్సెప్ట్ లు వచ్చిన తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మన సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో బీ టౌన్ భామలు ఇటువైపు కూడా ఒక కన్నెస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత ఒక బిగ్ బాలీవుడ్ సినిమాతో రాధేశ్యామ్ పోటీకి సిద్ధమైంది.

నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో..

నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో..

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం సాహో సినిమాతో బాలీవుడ్ ను మరోసారి అమితంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సౌత్ లో ఆడకపోయినా కూడా బాలీవుడ్ లో మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో కూడా అదే స్థాయిలో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా జులై 30న రాబోతున్న విషయం తెలిసిందే.

పోటీగా మరో బిగ్ బాలీవుడ్ మూవీ

పోటీగా మరో బిగ్ బాలీవుడ్ మూవీ

జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నార్త్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే పెట్టుకున్నారు. అయితే ప్రభాస్ కు పోటీగా మరో బిగ్ బాలీవుడ్ సినిమా అదే రోజు రావడానికి సిద్ధమైంది. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

 గంగూ భాయ్ కతియావాడి..

గంగూ భాయ్ కతియావాడి..

ప్రస్తుతం అలియా భట్ RRR సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందు ఆమె 'గంగూ భాయ్ కతియావాడి' అనే సినిమాతో రానుంది. గత ఎడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పద్మావత్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

రెడ్ లైట్ ఏరియా..రౌడిరాణిగా

రెడ్ లైట్ ఏరియా..రౌడిరాణిగా

ఈ సినిమా ముంబయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురాకు సంబంధించిన స్టోరీ. అప్పట్లో గంగూబాయి అనే ఒక మహిళ రౌడిరాణిగా అక్కడ దందాలు నిర్వహిస్తూ ఉండేది. చిన్న తనంలోనే వ్యభిచార గృహంలోకి వెళ్లి అనంతరం అక్కడి అక్కడే వ్యభిచార గృహాలను శాసిస్తూ రౌడీరాణిగా ఎదిగింది. ఆమె జీవిత ఆధారంగానే సినిమాను రూపొందిస్తున్నారు.

బాక్సాఫీస్ ఫైట్ లో గెలిచేదెవరు

బాక్సాఫీస్ ఫైట్ లో గెలిచేదెవరు

గంగూ భాయ్ కతియావాడిని మొదట ఏప్రిల్ లో రిలీజ్ చేయలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వలన జులై 30న రిలీజ్ చేయాలని డిసైస్ అయ్యారు. ఇక అదే రోజు రాధేశ్యామ్ కూడా తెరపైకి వస్తుండడంతో ఈ బాక్సాఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ రెండు డిఫరెంట్ జానర్ మూవీస్ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X