Radhe Shyam OTT: ఓటీటీలో రాధే శ్యామ్ సంచలనం.. పుష్ప రికార్డు బ్రేక్.. ఇండియాలోనే టాప్ మూవీగా ఘనత

సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించి.. ఇప్పుడు నేషనల్ రేంజ్‌లో దండయాత్ర చేస్తోన్న హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ స్టార్ హీరో 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా భారీ స్థాయిలో నష్టాలను చవి చూసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా చరిత్రను సృష్టించింది. దీంతో పుష్ప రికార్డు కూడా బ్రేక్ అయింది. ఆ వివరాలు మీకోసం!

‘రాధే శ్యామ్‌'గా వచ్చిన ప్రభాస్

‘రాధే శ్యామ్‌'గా వచ్చిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన చిత్రమే 'రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ దీనికి సంగీతం అందించాడు.

 ప్రీ రిలీజ్ బిజినెస్‌తో కొత్త రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో కొత్త రికార్డ్

టాలీవుడ్ స్టారే అయినా ప్రభాస్‌కు చాలా ప్రాంతాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'రాధే శ్యామ్'కు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందింత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందింత?

భారీ అంచనాలతో విడుదలైన 'రాధే శ్యామ్' మూవీకి ప్రేక్షకుల మద్దతు లభించలేదు. దీంతో ఏపీ, తెలంగాణలో ఈ చిత్రానికి ఇప్పటి వరకూ కేవలం రూ. 55 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమా మిగిలిన ప్రాంతాల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్లకు పైగా షేర్‌తో పాటు రూ. 150 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.

టార్గెట్ ఎంత? మూవీకి భారీ నష్టం

టార్గెట్ ఎంత? మూవీకి భారీ నష్టం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్లకు పైగానే వసూలు చేసింది. అంటే దీనికి దాదాపు రూ. 120 కోట్ల నష్టాలొచ్చాయి.

నెల కాకముందే ఓటీటీలో రిలీజ్

నెల కాకముందే ఓటీటీలో రిలీజ్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రాధే శ్యామ్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దీని రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యధిక డీల్‌కు కొనుగోలు చేసింది. తద్వారా విడుదలై నెల రోజులు కాకముందే స్ట్రీమింగ్‌ను కూడా మొదలెట్టింది.

 భారీ స్పందనతో గొప్ప రికార్డులు

భారీ స్పందనతో గొప్ప రికార్డులు

'రాధే శ్యామ్' మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్లలో పెద్దగా స్పందనను అందుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఫలితంగా వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది. అదే సమయంలో మరికొన్ని రికార్డులూ నమోదు అయ్యాయి.

పుష్ప రికార్డును బద్దలు కొట్టేస్తూ

పుష్ప రికార్డును బద్దలు కొట్టేస్తూ

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'రాధే శ్యామ్' మూవీ కేవలం 2 గంటల 5 నిమిషాల్లోనే వంద స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబట్టింది. ఈ క్రమంలోనే 'పుష్ప' పేరిట ఉన్న రికార్డు (8 గంటల 22 నిమిషాలు)ను దాటేసింది. దీంతో తెలుగులోనే కాకుండా దేశంలోనే నెంబర్ వన్ సినిమాగా రికార్డు నమోదు చేసింది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X