Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Radhe Shyam OTT: విడుదలై నెల కాకముందే ఓటీటీలోకి.. రాధే శ్యామ్ స్ట్రీమింగ్ అప్పటి నుంచే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. బాహుబలి మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాతో స్టార్‌డమ్‌ను పెంచుకోవడమే కాదు.. మార్కెట్‌ను కూడా గణనీయంగా విస్తృత పరుచుకున్నాడు. ఫలితంగా పాన్ ఇండియా స్టార్ అన్న పేరును సంపాదించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశనే ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి!

‘రాధే శ్యామ్'గా వచ్చిన రెబెల్ స్టార్
రెబెల్ స్టార్ ప్రభాస్- రాధాకృష్ణ కుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే ‘రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ దీనికి సంగీతం ఇచ్చాడు.
RRR 3 Days Collections: సండే అన్ని కోట్లతో అరాచకం.. 453 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో వచ్చిందెంతంటే!

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్
తెలుగు
హీరోనే
అయినా
ప్రభాస్‌కు
చాలా
ప్రాంతాల్లో
భారీ
మార్కెట్
ఉంది.
దీంతో
‘రాధే
శ్యామ్'
మూవీకి
ఏపీ
తెలంగాణలో
కలిపి
రూ.
105.20
కోట్లు,
కర్నాటకలో
రూ.
12.50
కోట్లు,
తమిళనాడులో
రూ.
6
కోట్లు,
కేరళలో
రూ.
2.10
కోట్లు,
హిందీలో
రూ.
50
కోట్లు,
రెస్టాఫ్
ఇండియా,
ఓవర్సీస్‌లో
కలిపి
రూ.
27
కోట్లతో
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
202.80
కోట్లు
బిజినెస్
అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఎన్నో
అంచనాలతో
వచ్చిన
‘రాధే
శ్యామ్'
మూవీకి
ప్రేక్షకుల
మద్దతు
లభించలేదు.
దీంతో
ఏపీ,
తెలంగాణలో
ఈ
చిత్రానికి
ఇప్పటి
వరకూ
కేవలం
రూ.
55
కోట్లు
మాత్రమే
వచ్చాయి.
అంతేకాదు,
ఈ
సినిమా
మిగిలిన
ప్రాంతాల్లోనూ
పెద్దగా
ప్రభావం
చూపలేకపోయింది.
దీంతో
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
83
కోట్లకు
పైగా
షేర్‌తో
పాటు
రూ.
150
కోట్లకు
పైగా
గ్రాస్‌ను
వసూలు
చేసింది.
Bigg Boss Non Stop: అఖిల్ అక్కడ చేయి పెట్టాడన్న హమీదా.. ‘ప్రైవేట్ పార్ట్' వీడియో చూపించడంతో!

టార్గెట్ ఎంత? మూవీకి భారీ నష్టం
రెబెల్
స్టార్
ప్రభాస్
నటించిన
‘రాధే
శ్యామ్'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
202.80
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
204
కోట్లుగా
నమోదైంది.
ఇక,
ఈ
సినిమా
ఇప్పటి
వరకూ
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
83
కోట్లకు
పైగానే
వసూలు
చేసింది.
అంటే
దీనికి
దాదాపు
రూ.
120
కోట్ల
నష్టాలు
వచ్చాయి.

రాధే శ్యామ్ ఓటీటీ రిలీజ్‌పై బజ్
క్రేజీ కాంబినేషన్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘రాధే శ్యామ్' మూవీకి థియేటర్లలో పెద్దగా స్పందన మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, దీన్ని ఫలానా రోజున ఓటీటీలో విడుదల చేస్తున్నారని కొన్ని డేట్లు తెరపైకి వచ్చాయి. దీంతో దీనిపై విపరీతమైన బజ్ ఏర్పడింది.
బాత్రూంలో నగ్నంగా హీరోయిన్: తల్లైనా తర్వాత కూడా ఇంత దారుణంగా!

రిలీజై నెల కాకముందే ఓటీటీలోకి
భారీ
బడ్జెట్‌తో
ఎంతో
ప్రతిష్టాత్మకంగా
రూపొందిన
‘రాధే
శ్యామ్'
మూవీ
డిజిటల్
స్ట్రీమింగ్
హక్కులకు
భారీ
స్థాయిలో
పోటీ
ఏర్పడిన
విషయం
తెలిసిందే.
ఈ
నేపథ్యంలో
దీని
రైట్స్‌ను
ప్రముఖ
ఓటీటీ
దిగ్గజం
అమెజాన్
ప్రైమ్
సంస్థ
అత్యధిక
డీల్‌కు
కొనుగోలు
చేసిందని
తెలిసింది.
ఈ
నేపథ్యంలోనే
ఇప్పుడు
ఈ
చిత్రాన్ని
స్ట్రీమింగ్
చేయబోతున్నట్లు
అధికారికంగా
ప్రకటించింది.
Recommended Video


సినిమా స్ట్రీమింగ్ అప్పటి నుంచే!
‘రాధే
శ్యామ్'
మూవీని
అమెజాన్
ప్రైమ్
వీడియోలో
ఏప్రిల్
1
నుంచి
స్ట్రీమింగ్
చేయబోతున్నారు.
ఈ
మేరకు
సదరు
సంస్థ
తాజాగా
ఓ
ట్రైలర్‌ను
కూడా
విడుదల
చేసింది.
ఇందులో
ఎన్నో
మంచి
మంచి
విజువల్స్‌ను
యాడ్
చేశారు.
ఇక,
ఈ
సినిమా
నెల
కూడా
తిరగక
ముందే
ఓటీటీలోకి
వస్తుండడంతో
ప్రభాస్
అభిమానులు
మాత్రం
ఫుల్
ఖుషీ
అయిపోతున్నారు.