Radheshyam: ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ట్రైలర్ 2పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది!
ఇండియన్ నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న ప్రభాస్ రానున్న రోజుల్లో తన స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచుకున్నాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. బడ్జెట్ లెక్కలు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ రేంజే అయితే ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. అంతే కాకుండా అతని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి అని కూడా అనిపిస్తోంది.
ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ రాధేశ్యామ్ సినిమా పైనే ఉంది యు.వి.క్రియేషన్స్ గోపికృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రాధా కృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అభిమానుల్లో కూడా ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ అలాగే మొదటి ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అసలైతే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. అప్పుడు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇక విడుదల చేసిన మొదటి ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. కానీ అప్పుడు అనుకోకుండా కరోనా పరిస్థితుల వలన వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక ఫైనల్ గా మార్చి 11వ తేదీన విడుదల చేయనున్నట్లు మరొక కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమా కాబట్టి తప్పకుండా అన్ని భాషల వారికి సినిమా నచ్చేలా ఉండాలి అని తెరకెక్కించారు. అసలు విషయంలోకి వెళ్తే సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని గత రెండు మూడు రోజులుగా చిత్ర యూనిట్ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ ను మార్చి 2న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లుగా యు.వి.క్రియేషన్స్ నుంచి అఫీషియల్గా క్లారిటీ వచ్చేసింది.
అంతేకాకుండా ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో రాధేశ్యామ్ ట్యాగ్ గట్టిగానే వైరల్ అవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన కథపై కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వేకువడుతున్నాయి. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు సరికొత్త విజువల్ ట్రీట్ ఇస్తాయాని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర కూడా చా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. క్లైమాక్స్ లో పూజా హెగ్డే - ప్రభాస్ మధ్య వచ్చే ఎమోషన్ లవ్ సీన్స్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాకు మరింత ఆకర్షణను తీసుకు వస్తాయని సమాచారం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుముంటుందో చూడాలి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈజీగా మొదటి రోజే వంద కోట్ల వసూళ్లను అందుముంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











