»   » టీవీ షోలో ప్రభాస్, రాజమౌళి: ఆసక్తిగా ఫ్యాన్స్....

టీవీ షోలో ప్రభాస్, రాజమౌళి: ఆసక్తిగా ఫ్యాన్స్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘సౌందర్య లహరి' పేరుతో ఓ సెలబ్రిటీ టీవీ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. తెలుగులో పాపులర్ టాక్ షోలలో ఇదీ ఒకటి. తాజాగా రాజమౌళి, ప్రభాస్ కూడా ఈ షోలో కనిపించబోతున్నారు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన టీవీ సీరియల్ ‘శాంతి నివాసం' ద్వారా రాజమౌళి కెరీర్ ప్రారంభించాడు. ‘స్టూడెంట్ నెం.1' ద్వారా దర్శకుడిగా మారిన రాఘవేంద్రరావు ప్రస్తుతం తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగారు. రాజమౌళి సినీ కెరీర్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఈ షోలో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ వారం కానీ, వచ్చే వారం కానీ టీవీలో ప్రసారం కానుంది.

Prabhas & Rajamouli in a 'Soundarya Lahari' Talk Show

రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ‘బాహుబలి' సినిమా విషయానికొస్తే...
ప్రభాస్‌ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. అనుష్క, రానా, తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'బాహుబలి-2' ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. బాహుబలి రీరికార్డింగ్ లో రియలిస్టిక్ సౌండ్స్ కోసం ఫిలిఫీ వెన్ లీర్ వంటి ప్రఖ్యాతి చెందిన కళాకారులు పనిచేస్తున్నారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు వెంట్రుకలు నిక్కుపెడుచుకునేలా రీరికార్డింగ్ ని చేయటానకి కీరవాణి ఏర్పాట్లు చెస్తున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

English summary
A lot of prominent film personalities have appeared on Celebrity Talk Show 'Soundarya Lahari' in the past. Its now the turn of Prabhas and Rajamouli to grace the show of Darsakendrudu K Raghavendra Rao.
Please Wait while comments are loading...