»   » ఎలక్షన్స్ మాయ.... ఆ లిస్టులో రాజమౌళి, ప్రభాస్ పేరు!

ఎలక్షన్స్ మాయ.... ఆ లిస్టులో రాజమౌళి, ప్రభాస్ పేరు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎవరూ ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని దారుణ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తెలుగు హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి గుంచిన వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. వీరి పేర్లు పేర్లు కృష్ణా జిల్లా 'గన్నవరం' నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఫోటోలతో సహా దర్శనమిచ్చాయి. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ సంస్థ సీఈఓ స్టీవ్ జాబ్స్ ఫోటో, పేరు కూడా ఈ లిస్టులో దర్శనమివ్వడం. ఈ చిత్రాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రభాస్ వివరాలు ఇలా ఉన్నాయి...

పేరు : ప్రభాస్ రాజు ఉప్పలపాటి
వయసు: 27
తండ్రి పేరు: సత్యనారాయణరాజు ఉప్పలపాటి
పోలింగ్ బూతు నెం: 201 (చిరివాడ)

Prabhas, Rajamouli names in Gannavaram voters list

రాజమౌళి గురించిన వివరాలు ఇలా...

పేరు: బాహుబలి జక్కన్న
తండ్రి పేరు: రాజమౌళి జక్కన్న
వయసు : 27
ఇంటి నెం: 6-89
పోలింగ్ బూతు నెం: 201(చిరివాడ)

స్టీవ్ జాబ్స్ గురించి ఇలా..

పేరు: స్టీవ్ జాబ్స్ దాసరి
తండ్రి పేరు: సత్యానారయణ జాబ్స్ దాసరి
వయసు : 25
పోలింగ్ బూతు నెం: 201(చిరివాడ)

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న 'బాహుబలి' సినిమా వివరాల్లోకి వెళితే......
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'. ప్రభాస్, రానా, అనుష్క ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా కూడా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ 'పంజా' చిత్రంలో నటించిన అడవి శేష్ ఈచిత్రంలోనూ ఓ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అడవి శేష్... రానా కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడట. రానాతో పాటు అడవి శేష్ కూడా ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.

ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

English summary
Telugu film stars Prabhas, Rajamouli and Apple Inc CEO Steve Jobs names in Gannavaram voters list
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu