తండ్రిని అలా చూడలేక రాజమౌళి కూతురు ఎమోషన్!
తండ్రి అలా కన్నీరు పెట్టుకుని, కళ్లు తుడుచుకుంటూ కిందకి దిగుతుండటంతో అది చూసి ఆయన కూతురు పరుగెత్తుకుంటూ వెళ్లి నాన్నను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఈ సంఘటన అందరినీ కదిలించింది. తర్వాత రాజమౌళి తన కూతు
హైదరాబాద్: బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు, రాజమౌళి పెద్దన్నయ్య కీరవాణి ఈ సందర్భంగా రాజమౌళి గురించి ప్రత్యేకంగా రాసి ట్యూన్ చేసిన ఓ పాటను ప్రదర్శించాడు.
ఈ సందర్భంగా కీరవాణి తమ్ముడి ప్రతిభను కీర్తస్తూ, ఒక పాటను రచించి, పాడి వినిపించారు. చిరకాలం వర్ధిల్లు అంటూ మనసారా దీవించారు. ఈ సందర్భంగా రాజమౌళి కాస్త ఎమోషన్ కు గురయ్యారు. ఈ భావోద్వేగంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

రాజమౌళి కూతురు తట్టుకోలేక
తండ్రి అలా కన్నీరు పెట్టుకుని, కళ్లు తుడుచుకుంటూ కిందకి దిగుతుండటంతో అది చూసి ఆయన కూతురు పరుగెత్తుకుంటూ వెళ్లి నాన్నను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఈ సంఘటన అందరినీ కదిలించింది. తర్వాత రాజమౌళి తన కూతురును సముదాయించాడు.

రాజమౌళి మాట్లాడుతూ...
రాజమౌళి మాట్లాడుతూ.... సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ చాలా అద్భుతంగా పని చేశారంటూ... అందరినీ పేరు పేరునా అభినందించారు. యూనిట్ తన కుటుంబం లాంటిదని చెప్పాడు. ఐదేళ్లు తనతో పని చేసినందుకు సెంధిల్, సాబు సిరిల్, కనల్ కణ్ణన్, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పాడు.

ప్రభాస్ కు నేను ఏం ఇచ్చాను?
హీరోయిజం ఎలా ఉండాలని ఊహించేవాడినో, అలాగే చేసేవాడినని.... అయితే ప్రభాస్ కు నేను ఏం ఇచ్చాను? అని ఆలోచించే వాడినని రాజమౌళి తెలిపాడు. బాంబేలో ప్రభాస్ ఓ ఫంక్షన్ కు వెళ్తే... అక్కడి మీడియా బాహుబలి అంటూ ప్రభాస్ ఎంటర్ అవుతున్నప్పుడు అరిచారని, అది తనకు చాలనిపించిందని రాజమౌలి అన్నాడు.

ప్రభాస్ మాట్లాడుతూ..
ప్రభాస్ మాట్లాడుతూ అభిమానుల కోసం ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేసే ప్రయత్నం చేస్తానని అన్నాడు. అభిమానులను అలరించేందుకు రెండు డైలాగులు చెప్పాడు. 'నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా' అంటూ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. 'వాడు తప్పు చేశాడు, వాడి తలతెగింది' అంటూ మరో డైలాగును కూయడ చెప్పడంతో వేదిక ప్రభాస్ నినాదాలతో మార్మోగి పోయింది.


Click it and Unblock the Notifications











