»   » చిరు 150వ మూవీ సెట్లో ప్రభాస్, రాజమౌళి!

చిరు 150వ మూవీ సెట్లో ప్రభాస్, రాజమౌళి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి స్టార్స్... డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్ శుక్రవారం చిరంజీవి 150వ సినిమా సెట్స్ కు వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసారు. ఇంతకాలం ప్రభాస్, రాజమౌళి బాహుబలి-2 మూవీ షూటంగులో బిజీగా ఉండటం వల్ల రాలేక పోయారు. అయితే ఈ మధ్యే టాకీ పార్టు మొత్తం షూటింగ్ పూర్తి కావడంతో వారు కాస్త ఫ్రీ అయ్యరు. దీంతో చిరంజీవిని కలిసేందుకు 'ఖైదీ నెం. 150' సెట్స్ కు వెళ్లారు.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

బాస్ ఈజ్ బ్యాక్

బాస్ ఈజ్ బ్యాక్

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన బాస్ ఈజ్ బ్యాక్ అనే సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్ అభిమానులతో కేరింతలు కొట్టించేలా ఉండబోతోందట.

స్పెషల్ సాంగ్

స్పెషల్ సాంగ్

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరంజీవి - ల‌క్ష్మీరాయ్‌పై రాఘ‌వ లారెన్స్ మాస్టర్ కొరియోగ్ర‌ఫీలో భారీ సెట్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ తెర‌కెక్కించారు.

స్టైలిష్ లుక్

స్టైలిష్ లుక్

ఎంత మెగాస్టార్ అయినా... ఈ వయసులో కుర్రోడిలా చేయడం కష్టమే అనేది కొందరి అభిప్రాయం. అయితే వారి అభిప్రాయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.

అరవైలో ఇరవై

అరవైలో ఇరవై

అరవైలో ఇరవైలా ఉండటం అంటే ఇదేనేమో. మోగాస్టార్ చిరంజీవి యవ్వనంలో ఉన్నప్పటి నుండే ఫిట్ నెస్, డైట్ బాగా మెయింటేన్ చేస్తున్నారు కాబట్టే ఆయన ఇపుడు ఇంత స్టైలిష్ గా ఉన్నాడని అంటున్నారంతా.

కాజల్

కాజల్

తెరపై రొమాంటిక్ సీన్లు, గ్లామర్ సీన్లు బాగా పండాలంటే అందమైన హీరోయిన్ తప్పనిసరి. చిరంజీవి వయసైపోయినోడు కదా అని ఏదో వయసైపోయిన హీరోయిన్ ను తీసుకురాలేదు. కత్రిలాంటి అందగత్తె కాజల్ ను ఎంపిక చేసారు.

English summary
Baahubali director SS Rajamouli and actor Prabhas paid a surprise visit to the sets of megastar Chiranjeevi's comeback movie Khaidi No 150 on Friday, October 21.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu