అనుష్క శెట్టిపై మనసు పడ్డ ప్రభాస్.. ఆ కామెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. రాంచరణ్ ఏం చేశాడంటే?

బాహుబలి, భాగమతి, నిశ్శబ్దం సినిమాల తర్వాత అందాల భామ అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు మహేష్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ గురించి ప్రభాస్, రాంచరణ్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. యంగ్ రెబల్ స్టార్, మెగా పవర్ స్టార్ చేసిన కామెంట్లు ఏమిటంటే?

Prabhas, Ram Charan Praises on Anushka Shettys Miss Shetty Mr Polishetty teaser

అనుష్క, నవీన్ పొలిశెట్టి క్రేజీ కాంబినేషన్: టాలీవుడ్‌కు చాలా కాలంగా దూరమైన అనుష్క శెట్టి తన ఇమేజ్‌కు, తన బాడీ లాంగ్వేజ్ తగిన పాత్రలో నటిస్తున్నారు. దాంతో మిస్ శెట్టి, మిస్ పొలిశెట్టి సినిమాకు భారీ క్రేజ్ కనిపిస్తున్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు పరిమితమైన అనుష్కశెట్టి.. ఓ యువ హీరోతో జతకట్టడంతో అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. అంతేకాకుండా జాతిరత్నాలు సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు క్రేజీగా మారింది.

Prabhas, Ram Charan Praises on Anushka Shettys Miss Shetty Mr Polishetty teaser

అనుష్క అలాంటి పాత్రలో: అనుష్క నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ టీజర్ ఇటీవల రిలీజై భారీ రెస్పాన్స్‌ను అందుకొన్నది. ఈ టీజర్‌కు సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ వర్గాలు, స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో ఈ టీజర్ ట్రెండ్ సెట్ చేసింది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటించారు.

Prabhas, Ram Charan Praises on Anushka Shettys Miss Shetty Mr Polishetty teaser

ప్రభాస్ చేసిన కామెంట్: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీజర్‌పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంది. టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ విష్ చేశారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్, అనుష్క శెట్టి ఫ్యాన్స్ కామెంట్లతో ముంచెత్తారు. అనుష్కకు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా విషెస్ తెలిపారు.

Prabhas, Ram Charan Praises on Anushka Shettys Miss Shetty Mr Polishetty teaser

రాంచరణ్ ట్విట్టర్‌లో: ఇక మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమా టీజర్‌పై రాంచరణ్ కూడా స్పందించాడు. టీజర్‌ను మెచ్చుకొంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్‌లో రాంచరణ్ స్పందిస్తూ.. #MissShettyMrPolishetty టీజర్‌ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌గా కనిపిస్తోంది 😃 మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు అని అన్నారు. దాంతో రాంచరణ్ ఫ్యాన్స్ కూడా భారీగా స్పందిస్తూ కామెంట్లతో హోరెత్తించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు
బ్యానర్: యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్: రాజవీన్,
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫి: నీరవ్ షా
పిఆర్వో: జీఎస్కే మీడియా
నిర్మాతలు: వంశీ-ప్రమోద్-విక్రమ్
రచన, దర్శకత్వం:మహేష్‌ బాబు పీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X