అక్కినేనికి ప్రభాస్, బన్నీ, రానా, వెంకీ నివాళి (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు యువ హీరోలు ప్రభాస్, రానా, గోపీచంద్, అల్లరి నరేష్, రామ్, అల్లు అర్జున్‌తో పాటు వెంకటేష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మోహన్ బాబు తదితరులు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో వీక్షించండి.
వెండితెరపై తన నటనతో దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన 'నట సామ్రాట్'.. 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత' అక్కినేని నాగేశ్వరరావు పరమపదించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయన వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్ పెట్టారు. తరువాత పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అప్పటికే శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు.
అక్కినేని అంత్య క్రియలు గురువారం జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

గోపీచంద్
హీరో గోపీచంద్ అక్కినేని నాగేశ్వరరావు పార్థిక దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

గోపీచంద్, ప్రభాస్, రాణా
అన్నపూర్ణ స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం ఉంచిన అక్కినేని భౌతిక కాయం వద్ద గోపీచంద్, ప్రభాస్, రానా

అల్లరి నరేష్
నటుడు అల్లరి నరేష్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

కోట శ్రీనివాసరావు
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఇలా భావోద్వేగానికి గురయ్యారు.

బ్రహ్మానందం
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

మోహన్ బాబు
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

రామ్
యువ నటుడు రామ్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అక్కినేని నాగేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం నాగార్జునను పరామర్శించారు.

వెంకటేష్
ప్రముఖ నటుడు వెంకటేష్, రానా అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అన్నపూర్ణ స్టూడియోకు వస్తున్న దృశ్యం.


Click it and Unblock the Notifications











